విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం నాడు కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.నిన్నటి నుండి అధికారులు ఈ ఆలయంలో సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే.
విజయవాడ: విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం నాడు కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.నిన్నటి నుండి అధికారులు ఈ ఆలయంలో సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఐదు బృందాలతో కూడ ఏసీబీ అధికారుల బృందం రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన అధికారులు సంయుక్తంగా ఈ సోదాలు చేపట్టారు.
undefined
టిక్కెట్టు , చీరల కౌంటర్, స్టోర్స్ పరిపాలన విభాగంలో కీలక ఆధారాలను ఏసీబీ అధికారులు సేకరించారు. అడ్మినిస్ట్రేషన్ విభాగంలో రికార్డులు, కంప్యూటర్ హర్డ్ డిస్కులను ఏసీబీ అధికారులు పూర్తిగా పరిశీలిస్తున్నారు.
అమ్మవారికి భక్తులు సమర్పించిన వేలాది చీరలను ఆలయ సిబ్బంది దొంగిలిస్తున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఈ విషయాలపై ఏసీబీ అధికారులు ఆలయ అధికారుల నుండి వివరాలను సేకరిస్తున్నారు.
ఏళ్ల తరబడి ఆలయంలోనే పనిచేస్తున్న సిబ్బంది వివరాలను కూడ ఏసీబీ సేకరిస్తోంది. అంతర్గత బదిలీలతో ఈ దేవాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సమాచారాన్ని కూడ ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు.