శ్రీరాముడి ఆలోచనలే బీజేపీ మౌలిక సిద్దాంతాలని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు.శుక్రవారం నాడు పలువురు ముస్లింలు గుంటూరులోని పార్టీ కార్యాలయంలో సోము వీర్రాజు సమక్షంలో బీజేపీలో చేరారు.
గుంటూరు: శ్రీరాముడి ఆలోచనలే బీజేపీ మౌలిక సిద్దాంతాలని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు.శుక్రవారం నాడు పలువురు ముస్లింలు గుంటూరులోని పార్టీ కార్యాలయంలో సోము వీర్రాజు సమక్షంలో బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.అబ్దుల్ కలాం ని రాష్ట్రపతి చేసింది బీజేపీయేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. మైనార్టీల అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ఏపీలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కేంద్రం చేస్తున్నదే అని సోమువీర్రాజు తెలిపారు.
ఏపీ రాష్ట్రంలో అభివృద్ది అంతా కేంద్ర ప్రభుత్వం ద్వారా సాగుతోందని ఆయన చెప్పారు. దేశంలో ఉన్నవారంతా వందేమాతం పాడాల్సిందేనన్నారు.
రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.టీడీపీతో పాటు వైసీపీలోని కొందరు అసంతృప్తులకు బీజేపీ గాలం వేస్తోంది. ఇతర పార్టీల నుండి త్వరలోనే పెద్ద ఎత్తున తమ పార్టీలో చేరనున్నారని ఆయన గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే జనసేనతో కలిసి బీజేపీ పొత్తు పెట్టుకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి.