అంతర్వేదిలో సిద్దమైన నూతన రథం: ప్రారంభించిన సీఎం జగన్

By narsimha lodeFirst Published Feb 19, 2021, 12:29 PM IST
Highlights

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీలక్ష్మినరసింహాస్వామి రథాన్ని ఏపీ సీఎం జగన్ శుక్రవారం నాడు ప్రారంభించారు. ఇవాళ ఉదయం అమరావతి నుండి నేరుగా అంతర్వేదికి చేరుకొన్నారు సీఎం జగన్.అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహాస్వామిని సీఎం దర్శించుకొన్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాకినాడ:తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో శ్రీలక్ష్మినరసింహాస్వామి రథాన్ని ఏపీ సీఎం జగన్ శుక్రవారం నాడు ప్రారంభించారు. ఇవాళ ఉదయం అమరావతి నుండి నేరుగా అంతర్వేదికి చేరుకొన్నారు సీఎం జగన్.అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహాస్వామిని సీఎం దర్శించుకొన్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఆ తర్వాత  రథాన్ని సీఎం పరిశీలించారు. రథానికి ప్రత్యేక పూజలు చేశారు సీఎం జగన్. 

రథం గురించి విశేషాలను సీఎం జగన్ అడిగి తెలుసుకొన్నారు. రథం విశిష్టతలను సీఎం జగన్ కు ఆలయ అధికారులు వివరించారు.గత ఏడాది సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి అంతర్వేది ఆలయానికి చెందిన రథం అగ్నికి ఆహుతైంది.  ఈ రథం అగ్నికి ఆహుతి కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చోటు చేసుకొన్నాయి. 

టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఈ అంశంపై వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. గతంలో కూడ ఇదే రథం అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. ఈ రథం అగ్నికి ఆహుతి కావడంతో కొత్త రథాన్ని రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయించింది. మూడు మాసాల్లోనే కొత్త రథాన్ని తయారు చేశారు.

ఏడంతస్తుల ఎత్తులో రథం తయారు చేశారు. రథానికి ఆరు చక్రాలు ఏర్పాటు చేశారు. రథం 42 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు ఉంటుంది. రూ.1.10 కోట్లతో రథాన్ని నిర్మించారు.

కొత్త రథానికి స్టీరింగ్ తో పాటు బ్రేకులను కూడ అమర్చారు. అంతేకాదు రథానికి ఇనుపగేటును కూడ అమర్చారు. గతంలో చోటుచేసుకొన్న అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం రథం నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకొంది.

click me!