శుక్రవారం ఉదయం అరెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు భవానిపురంలోని ఏసీబీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు.
శుక్రవారం ఉదయం అరెస్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు భవానిపురంలోని ఏసీబీ కార్యాలయం వద్దకు తీసుకొచ్చారు.
తెలుగుదేశం పార్టీ నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రను శుక్రవారం ఉదయం పోలీసులు తమ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ధూళిపాళ్ల నరేంద్రను అరెస్టు చేసి బాపట్లకు తరలించారు. శుక్రవారం తెల్లవారు జామునే నరేంద్ర ఇంటి వద్ద వంద మందికి పైగా పోలీసులు మోహరించారు.
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడిలో ధూళిపాళ్ల నరేంద్రను ఎసీబీ అధికారులు అరెస్టు చేశారు. కారణం చెప్పకుండా నరేంద్రను అరెస్టు చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పోలీసులు ఎందుకు అరెస్టు చేశారో తెలియక నరేంద్ర కుటుంబ సభ్యులు అయోమయంలో పడ్డారు.
ధూళిపాళ్ల నరేంద్ర ప్రస్తుతం సంగం డెయిరీ చైర్మన్ గా ఉన్నారు. సంగం డెయిరీలో అవకతవకలపై ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఆ విషయంపై విచారణ నిమిత్తం నరేంద్రను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు భావిస్తున్నారు.
కాగా ఆయన అరెస్ట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. అమూల్ సంస్థ కోసమే సంగం డెయిరీని బలి చేయాలని జగన్ చూస్తున్నాడంటూ.. మండి పడుతున్నారు.