దివ్యను లక్ష రూపాయాలకు పిన్ని కాంతవేణి విక్రయించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు.
విశాఖపట్టణం: దివ్యను లక్ష రూపాయాలకు పిన్ని కాంతవేణి విక్రయించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసును విచారిస్తున్న పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు.
దివ్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు సంచలన విషయాలను కనుగొన్నారు. దివ్య కేసులో అరెస్ట్ చేసిన నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించారు. కోర్టు అనుమతితో మూడు రోజులపాటు నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారించిన విషయం తెలిసిందే.
undefined
రెండేళ్ల క్రితం దివ్య అమ్మమ్మ, తల్లి, సోదరుడు అనుమానస్పదంగా మృతి చెందారు. ఇందులో అమ్మమ్మ మృతదేహం మాత్రమే గోదావరిలో శవమై కనిపించగా మిగిలిన ఇద్దరివీ ఇప్పటికీ ఆచూకి లభించలేదు.
దీంతో దివ్యను సొంత పిన్ని కాంతవేణి చేరదీసింది. అప్పడికే వ్యభిచార వృత్తిలో ఉన్న పిన్ని కాంతవేణి దివ్య ద్వారా కూడా డబ్బులు సంపాదించాలని భావించింది. ఇందులో భాగంగా దివ్యను బలవంతంగా ఒత్తిడి చేసి వ్యభిచార కూపంలోకి దింపినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకొన్నట్టుగా సమాచారం.
ఈ క్రమంలోనే తనకు పరిచయమున్న వ్యభిచార నిర్వాహకురాలు గీతకి దివ్యను లక్ష రూపాయాలకు కాంతవేణి విక్రయించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కీలకమైన ఆధారాలను సేకరించినట్టుగా తెలుస్తోంది.
కాంతవేణి సహజీవనం చేస్తున్న కృష్ణ బ్యాంకు అకౌంట్ లోకి గత ఏడాది సుమారు లక్ష రూపాయిలు గీత అకౌంట్ నుంచి ట్రాన్స్ ఫర్ కావడాన్ని పోలీసులు గుర్తించారు.ఈ విషయమై కాంతవేణిని పోలీసులు విచారిస్తే దివ్యను విక్రయించిన విషయం వెలుగు చూసిందని తేలింది.
దివ్యను కొనుక్కున్న గీత కొన్ని రోజుల పాటు తన వద్దే ఆశ్రయం ఇచ్చి దివ్యను విటుల వద్దకి పంపి డబ్బులు సంపాదించేది. ఆ తర్వాత పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో దివ్యను తాత్కాలింగా మరో వ్యభిచార నిర్వహకురాలు వసంత వద్దకి గీత పంపింది.
ఇక అప్పటి నుంచి దివ్య వసంత ఇంటి వద్దే ఉంటూ వసంత చెప్పినట్లుగా వ్యభిచారాన్ని నిర్వహించేది. దివ్య ద్వారా ఆదాయం బాగానే వస్తుండటంతో దివ్యను తన దగ్గరే ఉంచుకోవాలని వసంత భావించింది.
ఇందులో భాగంగా మధ్యలో ఒకసారి గీత దివ్యను వెనక్కి పంపేయాలని వసంతపై ఒత్తిడి తీసుకురాగా తన దగ్గర నుంచి వెళ్లిపోయిందని అబద్దం చెప్పింది. గీత ఒత్తిడి తగ్గడంతో వసంత దివ్య ద్వారా బాగా డబ్బులు సంపాదించడం ప్రారభించింది.
కాంతవేణి తనతో సహజీవనం చేస్తున్న కృష్ణ దగ్గరి బంధువు వీరబాబుతో 2018లో పెళ్లి చేయించింది. భర్త వీరబాబు, కృష్ణల సహాయంతో కాంతవేణి దివ్యను వ్యభిచార వృత్తిలోకి దింపిందని పోలీసులు అనుమానిస్తున్నారు.
రోజూ విటుల వద్దకి బలవంతంగా పంపడం వేలాది రూపాయిలు వస్తున్నా దివ్యకి రూపాయి కూడా ఇవ్వకపోవడం, ఆఖరికి దివ్య వద్ద ఫోన్ కూడా ఉండకుండా చేయడంతో గత కొద్ది రోజులుగా దివ్యకి, వసంతకి మధ్య గొడవలు జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలోనే వసంత దగ్గర నుంచి దివ్య బయటకి వెళ్లిపోవాలని భావించింది. దీంతో తన దగ్గర నుంచి దివ్య వెళ్లిపోతే వేలాది రూపాయిల ఆదాయం పోతుందని వసంత భావించి ఆమెను అంద విహీనంగా చేయాలని మొదట భావించింది. ఈ క్రమంలోనే ఆమెను చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్టుగా పోలీసులు దర్యాప్తులో తేల్చారు.