ఈఎస్ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడుతో పాటు వీళ్లను అరెస్ట్ చేశాం: ఏసీబీ డీజీ రవికుమార్

By narsimha lodeFirst Published Jun 12, 2020, 10:59 AM IST
Highlights

ఈఎస్ఐలో వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లు, ఇతరత్రా విషయాల్లో సుమారు రూ. 150 కోట్ల అవినీతి చోటు చేసుకొందని గుర్తించామని ఏసీబీ డీజీ రవికుమార్ చెప్పారు. ఈ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరో ఇద్దరిని కూడ అరెస్ట్ చేశామన్నారు. 


విజయవాడ: ఈఎస్ఐలో వైద్య పరికరాలు, మందుల కొనుగోళ్లు, ఇతరత్రా విషయాల్లో సుమారు రూ. 150 కోట్ల అవినీతి చోటు చేసుకొందని గుర్తించామని ఏసీబీ డీజీ రవికుమార్ చెప్పారు. ఈ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు మరో ఇద్దరిని కూడ అరెస్ట్ చేశామన్నారు. 

శుక్రవారం నాడు ఏసీబీ డీజీ రవికుమార్ విజయవాడలో మీడియాతో మాట్లాడారు.2014-19 వరకు వైద్య పరికరాల కొనుగోళ్లలో అవినీతి జరిగిందని విజిలెెన్స్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికపై విచారణ చేయాలని ప్రభుత్వం తమను ఆదేశించిందన్నారు.

నిబంధనలను ఉల్లంఘించి కొనుగోళ్లు చోటు చేసుకొన్న విషయాన్ని గుర్తించామన్నారు. ల్యాబ్ కిట్స్ , శస్త్ర చికిత్స పరికరాలు, బయో మెట్రిక్ మెషిన్లు తదితర కొనుగోళ్లలో కూడ అక్రమాలు చోటుచేసుకొన్నట్టుగా ఆయన చెప్పారు.

నామినేషన్ పద్దతిలోనే టెండర్లను కేటాయించారన్నారు. 50 నుండి 130 శాతం వరకు అధిక ధరలకు వీటిని కొనుగోలు చేశారన్నారు.  రూ. 150 కోట్ల మేరకు అవినీతి జరిగిందని ఏసీబీ డీజీ రవికుమార్ తేల్చి చెప్పారు.

అప్పట్లో డైరెక్టర్ గా సికె రవికుమార్, మరో డైరెక్టర్ విజయ్ కుమార్ లతో పాటు మాజీ మంత్రి అచ్చెన్నాయుడును కూడ అరెస్ట్ చేసినట్టుగా ఆయన తెలిపారు.

టెలీ హెల్త్ లో  రూ.1.50 లకు కాకుండా రూ. 4 లకు పైగా వసూలు చేశారని గుర్తించామన్నారు. ఈఎస్ఐ స్కామ్ లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పాత్ర ఉందని తేలిందన్నారు. ఈ కేసులో డాక్టర్ జనార్ధన్, రమేష్ బాబు, చక్రవర్తిని అరెస్ట్ చేస్తామన్నారు. మందులు, వైద్య పరికరాల కొనుగోలులో 150 కోట్లకు పైగా అవినీతి గుర్తించామన్నారు. 

also read:మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్: ఈఎస్ఐ స్కామ్ ఏమిటి?

అచ్చెన్నాయుడు అరెస్ట్ చేయడంలో అన్ని రకాల నిబంధనలను ఫాలో అయ్యామన్నారు. ఈ కేసులో 19 మంది ప్రమేయం ఉన్నట్టుగా గుర్తించామని ఆయన తేల్చి చెప్పారు. విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు.నకిలీ బిల్లులు, నకిలీ ఇన్ వాయిస్‌లతో పాటు నామినేషన్ పద్దతుల్లో టెండర్లను కేటాయించారని గుర్తించామన్నారు. 

అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ సమాచారాన్ని స్పీకర్ దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. ఇవాళ సాయంత్రంలోపుగా ఏసీబీ కోర్టులో అచ్చెన్నాయుడును ప్రవేశపెడతామన్నారు.

click me!