chandra babu naidu...చంద్రబాబుపై ఏపీ సీఐడీ పీటీ వారంట్లు: తోసిపుచ్చిన ఏసీబీ కోర్టు

By narsimha lodeFirst Published Dec 5, 2023, 11:59 AM IST
Highlights

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు,ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసుల్లో  ఏపీ సీఐడీ చంద్రబాబుపై పీటీ వారంట్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే.  ఈ పీటీ వారంట్లను  ఏసీబీ కోర్టు ఇవాళ తోసిపుచ్చింది. 

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్ మెంట్(ఏపీ సీఐడీ ) దాఖలు చేసిన పీటీ వారంట్లను ఏసీబీ కోర్టు  మంగళవారంనాడు తోసిపుచ్చింది.

ఆంధ్రప్రదేశ్ ఇన్నర్ రింగ్ రోడ్డు, ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కేసుల్లో  చంద్రబాబుపై పీటీ వారంట్లను  ఏసీబీ కోర్టులో  దాఖలు చేసింది.  అయితే  చంద్రబాబుపై బెయిల్ ఉన్నందన  పీటీ వారంట్లు నిరర్ధకమౌతాయని ఏసీబీ కోర్టు ఇవాళ తేల్చి చెప్పింది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై  ఏపీ సీఐడీ దాఖలు చేసిన  పీటీ వారంట్లను ఏసీబీ కోర్టు  మంగళవారంనాడు తోసిపుచ్చింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ,ఆంధ్రప్రదేశ్ ఫైబర్ గ్రిడ్ కేసుల్లో  చంద్రబాబుపై  ఏపీ సీఐడీ దాఖలు చేసిన పీటీ వారంట్లను  ఏసీబీ కోర్టు  ఇవాళ తోసిపుచ్చింది. చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్న సమయంలో ఈ పీటీ వారంట్లను సీఐడీ దాఖలు చేసింది. 

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును  ఆంధ్రప్రదేశ్ సీఐడీ  అధికారులు ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన అరెస్ట్ చేశారు.ఈ కేసులో చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో  ఈ ఏడాది అక్టోబర్ 31వ తేదీ వరకు  రాజమండ్రి జైలులో ఉన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలోనే  అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో అవకతవకలపై ఏపీ సీఐడీ  అధికారులు ఏసీబీ కోర్టులో పీటీ వారంట్ దాఖలు చేశారు.మరో వైపు ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో కూడ చంద్రబాబుపై పీటీ వారంట్ దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు బెయిల్ పై ఉన్నందున పీటీ వారంట్లకు  విచారణ అర్హత లేదని ఏసీబీ కోర్టు  తోసిపుచ్చింది.

also read:Nara Chandrababu Naidu Bail:డిసెంబర్ 8 లోపుగా కౌంటర్ దాఖలుకు బాబుకు సుప్రీం ఆదేశం

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  చంద్రబాబుకు ఈ ఏడాది అక్టోబర్  31న ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ వచ్చింది. ఈ ఏడాది నవంబర్  20న  ఇదే కేసులో రెగ్యులర్ బెయిల్ కూడ చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మంజూరు చేసింది.

also read:Telangana Election Results 2023:తెలంగాణలో కేసీఆర్‌కు బాబు రిటర్న్ గిఫ్ట్

ఏపీ ఫైబర్ నెట్ , ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో  ముందస్తు బెయిల్  కోరుతూ చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏపీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో కూడ   పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే  ఇవాళ పీటీ వారంట్లపై ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణకు వచ్చింది. స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ పై ఉన్నందున  పీటీ వారంట్లు విచారణకు అర్హత లేదని ఏసీబీ కోర్టు తేల్చి చెప్పింది.. 

చంద్రబాబుకు ఏపీ హైకోర్టు  బెయిల్ ఇవ్వడాన్ని  ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.ఈ పిటిషన్ పై విచారణ ఈ నెల  8వ తేదీకి విచారణ చేయనుంది. తమ వాదనలను ఏపీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని  ఏపీ సీఐడీ వాదించింది.  ఈ నెల  8వ తేదీన  విచారణలో  సుప్రీంకోర్టులో ఇరు వర్గాలు తమ వాదనలను విన్పించనున్నాయి.
 


 

click me!