ఏపీ ఫైబర్ నెట్ కేసులో పీటీవారంట్‌కు ఆమోదం: చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలన్న జడ్జి

By narsimha lode  |  First Published Oct 12, 2023, 4:22 PM IST

ఏపీ ఫైబర్ నెట్ కేసులో  సీఐడీ దాఖలు చేసిన పీటీ వారంట్ కు ఏసీబీ కోర్టు గురువారం నాడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  


అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ కేసులో  సీఐడీ దాఖలు చేసిన  పీటీ వారంట్ కు  ఏసీబీ కోర్టు గురువారం నాడు ఆమోదించింది.  ఈ నెల  16న చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. చంద్రబాబును వ్యక్తిగతంగా హాజరు పర్చాలని  జడ్జి ఆదేశించారు.సోమవారం నాడు  ఉదయం పదిన్నర నుండి సాయంత్రం ఐదు గంటలలోపు  కోర్టు ముందు చంద్రబాబును  ప్రత్యక్షంగా హాజరుపర్చాలని ఆదేశించింది ఏసీబీ కోర్టు.   రేపు చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు తీర్పులు వస్తే  జోక్యం చేసుకోవచ్చని  చంద్రబాబు తరపు న్యాయవాదులకు  ఏసీబీ కోర్టు సూచించింది.

ఏపీ ఫైబర్ నెట్ కేసులో పిటి వారెంట్ ల పై ఇప్పటికే వాదనలు ముగిశాయి. ఫైనల్ గా మీ వాదనలు వినిపించాలని న్యాయవాదుల కు జడ్జి సూచించారు. చంద్రబాబు తరపున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు విన్పించారు.సిఐడి తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేకానంద వాదించారు. ఈరోజు వాదనలు పూర్తి చేస్తే నిర్ణయం చెబుతానన్న న్యాయమూర్తి ప్రకటించారు. సుప్రీంకోర్టు లో రేపు క్వాష్ పిటిషన్ విచారణ ఉంది. దీంతో తీర్పును రేపటికి  వాయిదా వేయాలని ఏసీబీ కోర్టు జడ్జిని  చంద్రబాబు లాయర్లు కోరారు.

Latest Videos

undefined

అయితే ఈ విషయమై  సీఐడీ  న్యాయవాదులు వచ్చిన తర్వాత వాళ్ళ అభిప్రాయం కూడా  తీసుకొని నిర్ణయం చెబుతామన్నారు జడ్జి.  కోర్టును పది నిమిషాలు వాయిదా వేశారు న్యాయమూర్తి.ఫైబర్ నెట్ కేసులో తిరిగి విచారణ ప్రారంభమైన తర్వాత చంద్రబాబు తరపున దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు విన్పించారు. సీఐడి తరుపున న్యాయవాది వివేకానంద వాదించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత  ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో పీటీవారంట్ కు  ఏసీబీ కోర్టు అనుమతిని ఇచ్చింది. సోమవారం నాడు చంద్రబాబును కోర్టులో హాజరుపర్చాలని ఆదేశించింది. 


 

click me!