కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నారా లోకేష్‌తో కలిసి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది . దీంతో పురందేశ్వరిని వైసీపీ టార్గెట్ చేసింది . అమిత్ షాతో పురందేశ్వరి భేటీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ధర్నాలు, నిరసనలు జరుగుతున్నాయి. అటు చంద్రబాబుకు బెయిల్ కోసం ఆయన తరపు న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను నారా లోకేష్‌తో కలిసి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పురందేశ్వరిని వైసీపీ టార్గెట్ చేసింది. కేంద్ర పెద్దల ద్వారా తన మరిదిని బయటకు తీసుకొచ్చేందుకు పురందేశ్వరి ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తున్నారు. తాజాగా అమిత్ షాతో పురందేశ్వరి భేటీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Also Read: బిగ్ బ్రేకింగ్: చంద్రబాబు విడుదల తర్వాత ఏపీ-తెలంగాణ టీడీపీ-బీజేపీ ఎన్నికల పొత్తు ప్రకటన?
'అమ్మా పురందేశ్వరిగారూ... మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించాడు. నేరం జరిగింది. మీ మరిది చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. 13 సార్లు సంతకం కూడా పెట్టాడు. అయినా ఆయనకు చట్టం వర్తింపజేయటానికి వీల్లేదని మీరు ఢిల్లీలో క్యాంపెయిన్ చేస్తున్నారు.
ఒక ఫేక్ అగ్రిమెంట్‌తో స్కిల్ స్కాం చేశారని కేంద్ర ప్రభుత్వ ఈడీ అరెస్టులు కూడా చేసింది. ఆ ఒప్పందం ఫేక్ అని సీమెన్స్ కంపెనీ కూడా ధ్రువీకరించింది. ఆ అగ్రిమెంట్‌తో తమకు సంబంధం లేదని కూడా చెప్పింది. ఆ డబ్బు తమకు అందలేదని 164 స్టేట్‌మెంట్‌లో చెప్పింది.
సాక్షాత్తు మీ మరిది చంద్రబాబు ఆ డబ్బును షెల్ కంపెనీల ద్వారా ఎలా రూట్ చేశారో స్వయంగా బాబు పీఏ వెల్లడించిన విషయం ఐటీ శాఖ నిర్ధారించింది. ఒక చిన్న కేసులో ఏకంగా రూ. 119 కోట్ల ముడుపుల్ని నిర్ధారిస్తూ కేంద్ర ప్రభుత్వ ఐటీ శాఖ, మీ మరిది చంద్రబాబుకు సుదీర్ఘమైన ఉత్తర ప్రత్యుత్తరాల తరవాత షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
1/3. అమ్మా పురందేశ్వరిగారూ...
మీ చుట్టం చట్టాన్ని ఉల్లంఘించాడు. నేరం జరిగింది. మీ మరిది చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. 13సార్లు సంతకం కూడా పెట్టాడు. అయినా ఆయనకు చట్టం వర్తింపజేయటానికి వీల్లేదని మీరు ఢిల్లీలో క్యాంపెయిన్ చేస్తున్నారు.
2/3. ఒక ఫేక్ ఎగ్రిమెంట్‌తో స్కిల్… pic.twitter.com/nuT2FCcX9X