సీఐడీ అధికారుల కాల్ రికార్డ్స్ ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.
అమరావతి: టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డు పిటిషన్ పై విచారణ ఈ నెల 26కి వాయిదా పడింది. ఈ పిటిషన్ పై విచారణ జరిగింది.చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని పీపీని ఏసీబీ కోర్టు ఆదేశించింది.అయితే ఈ విషయంలో తమకు ఈ నెల 26వ తేదీ వరకు సమయం కావాలని పీపీ ఏసీబీ కోర్టును కోరారు.పీపీ వినతి మేరకు ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 26వ తేదీ వరకు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబును ఈ ఏడాది సెప్టెంబర్ 9న ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల మొబైల్ కాల్ డేటా ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 11న చంద్రబాబు తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సవరించాలని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సూచించారు. ఆ తర్వాత పిటిషన్ ను సవరించి ఏసీబీ కోర్టులో చంద్రబాబు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 18వ తేదీకి వాయిదా పడింది.
undefined
ఏపీ ఫైబర్ నెట్ కేసు, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులకు సంబంధించి చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నందున సీఐడీ అధికారుల కాల్ డేటాపై విచారణను ఈ నెల 20వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఇవాళ ఏసీబీ కోర్టు ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏసీబీ కోర్టును కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కోరడంతో విచారణను ఈ నెల 26వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.
also read:బాబుకు షాక్:లీగల్ ములాఖత్ పెంచాలని దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో నంద్యాలలో ఉన్న చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారని టీడీపీ ఆరోపిస్తుంది. ఈ కేసుతో పాటు ఏపీ ఫైబర్ నెట్ కేసు,అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో పీటీ వారంట్లను ఏసీబీ కోర్టుల్లో సీఐడీ దాఖలు చేసింది.