ఏపీ ఫైబర్ నెట్ కేసు: చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ నవంబర్ 8వ తేదీకి వాయిదా

By narsimha lode  |  First Published Oct 20, 2023, 11:08 AM IST

ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన  ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ  ఈ ఏడాది నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.


అమరావతి: ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై  విచారణను ఈ ఏడాది నవంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది  సుప్రీంకోర్టు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు తీర్పు తర్వాత  ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ నిర్వహిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం నాడు ప్రకటించింది.ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుపై పీటీ వారంట్ పై యథాతథస్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఏపీ ఫైబర్ నెట్ కేసులకు సంబంధించి 17 ఏ సెక్షన్ చుట్టూనే వాదనలు సాగుతున్నాయి.  ఒక కేసులో అరెస్టైన  వ్యక్తిని మరో కేసులో విచారించాలని భావించినప్పుడు కోర్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉందని  సీఐడీ తరపు న్యాయవాదులు  కోర్టు దృష్టికి తెచ్చారు.
 ఏపీ ఫైబర్ నెట్ కేసులో విచారణ జరుగుతుందా, దర్యాప్తు చేస్తారా, నిందితుడిగా ఉన్న వ్యక్తిని ప్రశ్నిస్తారా లేదా అనే విషయాలను పక్కన పెడితే  ఇప్పటికిప్పుడే  ఏపీ ఫైబర్ నెట్ కేసులో విచారణ చేయడం లేదని సీఐడీ తరపు న్యాయవాదులు  సుప్రీంకోర్టు ధర్మాసనానికి తేల్చి చెప్పారు.

Latest Videos

undefined

ఏపీ ఫైబర్ నెట్ కేసుకు ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో కూడ లింకుందని సుప్రీంకోర్టు తెలిపింది.  ఈ రెండు కేసుల విషయంలో 17 ఏ సెక్షన్ మీదే వాదనలు జరిగిన విషయాన్ని కోర్టు ప్రస్తావించింది. తొలుత ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుపై తీర్పును వెల్లడించనున్నట్టుగా సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ ప్రకటించింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు తీర్పును వెల్లడించిన తర్వాత  ఏపీ ఫైబర్ నెట్ కేసు విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు ప్రకటించింది.

ఏపీ ఫైబర్ నెట్ కేసులో  చంద్రబాబు పీటీ వారంట్ పై యథాతథస్థితిని కొనసాగించాలని  సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు  ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని,  పీటీ వారంట్ ను  అమలు చేయవద్దని కూడ సుప్రీంకోర్టు సూచించింది. 
 

click me!