
ఆయనకు ఏపీ సీఎం జగన్ అంటే ఎంతో అభిమానం. వైసీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే వ్యక్తి. కానీ ఉన్నట్టుండి ఆయన ఒక్క సారిగా ప్రతిపక్ష టీడీపీలో చేరిపోయారు. ఇప్పుడు ఈ విషయంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఆ యువకుడి పేరు ముతకని రమేష్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని చుండికి గ్రామానికి చెందిన అతడు జగన్ మోహన్ రెడ్డిని ఎంతగానో అభిమానించేవారు. ఎంత అభిమానం అంటే వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ పేరును ఏకంగా చేతిపై పచ్చబొట్టుగా కూడా పొడిపించుకున్నాడు.
ఎల్లుండి ఏపీకి ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము.. సీఎం జగన్ నివాసంలో తేనీటి విందు..
అంతగా అభిమానించే నాయకుడి పార్టీ అయిన వైసీపీ నుంచి ఆయన ఒక్క సారిగా టీడీపీలోకి జంప్ అయ్యారు. శనివారం రాత్రి తన చుట్టాలు, ఫ్రెండ్స్ తో కలిసి టీడీపీలోకి చేరిపోయారు. రమేష్ ను కందుకూరు అసెంబ్లీ నియోజవర్గ టీడీపీ ఇంఛార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ విషయంలో ఆదివారం నెల్లూరు జిల్లాలో విస్తృతంగా వ్యాపించింది.