
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపది ముర్ము ఎల్లుండి ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ద్రౌపది ముర్ము.. ఎల్లుండి ఏపీకి వస్తున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలతో ద్రౌపది ముర్ము భేటీ కానున్నారు. తర్వాత సాయంత్రం 5 గంటలకు ఆమె సీఎం జగన్ నివాసానికి వెళ్తారు. అక్కడ సీఎం జగన్ ఇచ్చే తేనీటి విందులో పాల్గొంటారు. ఇక, రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు వైసీపీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇక, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో నిలిచారు. ఈ నెల 18న బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ జరుగుతుంది. పార్లమెంట్‌తో పాటు, ఆయా రాష్ట్రాల శాసనసభల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అనంతరం బ్యాలెట్ బాక్స్‌లను పార్లమెంట్‌కు తరలిస్తారు. ఈ నెల 21వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు ఫలితాలను ప్రకటించనున్నారు. ఈ ఎన్నికలకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్నారు.