హోం గార్డులకు టిటిడిపి మద్దతు

Published : Oct 28, 2016, 10:49 AM ISTUpdated : Mar 26, 2018, 12:02 AM IST
హోం గార్డులకు టిటిడిపి మద్దతు

సారాంశం

హోం గార్డులకు మద్దతు ప్రకటించిన టిటిడిపి కెసిఆర్ కు రేవంత్ లేఖ

హోం గార్డుల సమస్యను ప్రభుత్వం పరిష్కరించకుంటే వారికి మద్దతుగా ఆందోళనకు దిగుతామని టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావును హెచ్చరించారు. ఈ మేరకు రేవంత్ సిఎంకు శుక్రవారం లేఖ రాసారు.

దీర్ఘకాలంగా అపరిష్కృంగా ఉన్న డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేసిన వారిపై ఆంధ్ర పాలకులకన్నా అన్యాయంగా అణిచివేయటం దారుణమన్నారు. గతంలో  ఆందోళనలు చేసిన హోం గార్డులకు మద్దతుగా ఇందిరా పార్క్ వద్ద ప్రసంగించిన మీరే ఇపుడు వారి డిమాండ్లను అణిచివేయాలని చూడటం అన్యాయమన్నారు.

 రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 19600 మంది హోంగార్డుల దీర్ఘ కాల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని రేవంత్ డిమాండ్ చేసారు. ఇతర పోలీసులతో పాటు రోజులో 16 గంటలు పనిచేస్తున్న వారి డిమాండ్లు సహేతుకమైనవని అభిప్రాయపడ్డారు. హోం గార్డుల సాయం లేకపోతే పోలీసులు మాత్రమే విధులు నిర్వర్తించాలంటే కష్టమన్న సంగతిని ప్రభుత్వం గ్రహించాలన్నారు.

అటువంటి వారిపై దౌర్జన్యాలు చేస్తున్నవారిని చూస్తుంటే తెలంగాణా ప్రజల గుండెలు మండుతున్నట్లు రేవంత్ మండిపడ్దారు. పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్న హోం గార్డలకు కూడా పోలీసులతో సమానంగా జీతాలివ్వాలని గతంలోనే సుప్రింకోర్టు చెప్పినా పట్టించుకోక పోవటం దారుణమన్నారు.  గతంలో అధ్యాపకులు, టీచర్లు, హోంగార్డుల విషయంలో 2008లో కెసిఆర్ ఇచ్చిన హామీల తాలూకు పత్రికా వార్తల క్లిప్పింగులను కూడా రేవంత్ సిఎంకు పంపారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?