పండగ పూట విషాదం.. ముగ్గులు వేస్తుండగా దూసుకొచ్చిన లారీ.. యువతి మృతి..

By Sairam IndurFirst Published Jan 14, 2024, 3:18 PM IST
Highlights

సంక్రాంత్రి పండగ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో విషాదం జరిగింది. మండపేట మండలంలోని కానుకొల్లు గ్రామంలో ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న అక్కా చెళ్లెల్లపై లారీ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు.

సంక్రాంత్రి అంటే అందరికీ గుర్తొచ్చేది ముగ్గులు, పిండి వంటలు, గాలిపటాలు. ఉదయమే లేచి అక్కా చెళ్లెల్లు ఇంటి ముందర ముగ్గు వేసి గొబ్బెమ్మలు పెడుతుంటారు. భోగి మంటలు పెట్టి సంబంరాలు జరుపుకుంటారు. అనంతరం రకరకాల వంటలకాలు చేసుకొని, వాటిని ఆరగిస్తూ స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అయితే ఎన్నో సంతోషాలతో మొదలైన భోగి పండగ రోజు ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. 

PM Modi: నాటి కల నేడు సాకారం.. 32 ఏళ్ల నాటి మోదీ ఫోటోలు వైరల్..

Latest Videos

భోగి పండగ వేళ ఇంటి ముందు ఎంతో ఆనందంగా ముగ్గులు వేస్తున్న ఓ యువతికి తీవ్ర ప్రమాదం జరిగింది. ఏలూరు జిల్లాలోని మండపల్లి మండలం కానుకొల్లు గ్రామంలో 17 ఏళ్ల పంగిళ్ల తేజశ్విని, 18 ఏళ్ల పంగిళ్ల పల్లవి దుర్గ అనే అక్కాచెళ్లెల్లు జీవిస్తున్నారు. ఆదివారం భోగి పండగ కావడంతో ఇద్దరూ ఉదయమే లేచి తమ ఇంటి ముందు ముగ్గు వేసేందుకు సిద్ధమయ్యారు. 

విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి 19యేళ్లకే సన్యాసినిగా మారుతున్న వజ్రాలవ్యాపారి కుమార్తె..

ముగ్గు వేయడం మొదలు పెట్టిన కొంత సమయంలోనే ఇటుక లోడ్ తో వెళ్తున్న ఓ లారీ వేగంగా వారిపైకి దూసుకొచ్చింది. అంతా క్షణకాలంలోనే జరిగింది. ఈ ప్రమాదంలో తేజశ్విని అక్కడికక్కడే మరణించింది. అక్క పల్లవి దుర్గకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వీరిని గమనించి హుటా హుటిన దగ్గరలోని ఓ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ప్రస్తుతం పల్లవి చికిత్స పొందుతోంది. 

జలమండలి జీఎంకు మూడేళ్ల జైలుశిక్ష.. ఏసీబీ కోర్టు సంచలన తీర్పు..

ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ప్రకాష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. పండగ రోజు అక్కా చెల్లెళ్లు ప్రమాదానికి గురి కావడం, ఒకరు మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ గ్రామమంతా విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!