తిరుమ‌లలో క‌ల‌క‌లం సృష్టించిన ఏసు క్రీస్తు స్టిక‌ర్ ఉన్న కారు.. హుటాహుటిన రంగంలోకి దిగిన అధికారులు..

By team teluguFirst Published Aug 4, 2022, 10:52 AM IST
Highlights

తిరుమల మరో వివాదం చెలరేగక ముందే అధికారులు హుటాహుటిన స్పందించారు. ఏసు క్రీస్తు స్టిక్కర్ ఉన్న కారు పట్టణంలో తిరుగుతుండటంతో వెంటనే దానిని గుర్తించి తొలగించారు. 

ఏసుక్రీస్తు స్టిక‌ర్ అతికించి ఉన్న కారు తిరుమలలో తిర‌గడం బుధ‌వారం క‌ల‌క‌లం సృష్టించింది. చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో కారు తిర‌గుతూ హ‌ల్ చ‌ల్ చేసింది. అయితే దీనిని గుర్తించిన ప‌లువురు స్థానికులు ఈ విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగారు. కారు అద్దాల నుంచి స్టిక్కర్ ను తొల‌గించారు.

ఆస్తికోసం.. బామ్మర్థిని చంపి, గోతిలో పూడ్చిపెట్టిన బావ.. రెండునెలల తరువాత వెలుగులోకి..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ చారిటబుల్ అండ్ హిందూ రిలిజియస్ ఎండోమెంట్స్ చట్టం లోని నిబంధనల ప్రకారం.. తిరుమలలో హిందూ మతం మినహా ఇతర మతాలకు చెందిన విగ్రహాలు, స్టిక్కర్ల‌ను ప్రదర్శించడం నిషేధంలో ఉంద‌ని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తన క‌థ‌నంలో నివేదించింది. ఇటీవ‌ల ఛ‌త్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఉన్న వాహనాన్ని అనుమతించలేమని పేర్కొంటూ మహారాష్ట్ర భక్తుల బృందాన్ని అలిపిరి వద్ద టీటీడీ విజిలెన్స్, భద్రతా సిబ్బంది ఆపిన సంగ‌తి తెలిసిందే. ఈ అంశం ఆ స‌మ‌యంలో పెద్ద వివాదంగా మారింది.

తూ.గో జిల్లాలో విషాదం: ఫిల్టర్ శుభ్రం చేస్తున్నఇద్దరు కార్మికులు మృతి

అయితే ఇది కమ్యూ నికేషన్ గ్యాప్ అని టీటీడీ పేర్కొన్నారు. అనంత‌రం భక్తులను ద‌ర్శ‌నం చేసుకునేందుకు అనుమతించారు. కాగా తాజాగా ఘ‌ట‌న‌లో అలిపిరి చెక్ పాయింట్ వ‌ద్ద కాపలాగా ఉన్న అదే విజిలెన్స్, భద్రతా సిబ్బంది ఇతర మతాలకు చెందిన మతపరమైన స్టిక్కర్ ను తొల‌గించ‌డంలో విఫలమవడంతో తిరుమలలోని వారి సహచరులు వాహనాన్ని గుర్తించారు. సమస్య ఇంకా మ‌రొక వివాదంగా మార‌క‌ముందే కారు విండ్ షీల్డ్ నుంచి స్టిక్క‌ర్ ను తొలగించారు. 

click me!