తూ.గో జిల్లాలో విషాదం: ఫిల్టర్ శుభ్రం చేస్తున్నఇద్దరు కార్మికులు మృతి

Published : Aug 04, 2022, 10:22 AM IST
తూ.గో జిల్లాలో విషాదం: ఫిల్టర్ శుభ్రం చేస్తున్నఇద్దరు కార్మికులు మృతి

సారాంశం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో ఫిల్టర్ శుభ్రం చేస్తున్ కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. ఇద్దరు కార్మికులు ఈ ఘటనలో మరణించారు. ఈ ఘటనలో మరో కార్మికుడు అస్వస్థతకు గురయ్యాడు.  

కాకినాడ: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో ఊపిరాడక  ఇద్దరు కార్మికులు గురువారం నాడు మరణించారు.  ఈ ఫ్యాక్టరీలోని ఫిల్టర్ ను శుభ్రం చేస్తున్న  సమయంలో  ఈ ఘటన చోటు చేసుకుంది.  మృతులను గాజుల శ్రీను, ఒడిశాకు చెందిన డోమాగా గుర్తించారు. 

 ఈ ఘటనలో మరో కార్మికుడు తీవ్రంగా అస్వస్థతకు గురయ్యాడు. అస్వస్థతకు గురైన  కార్మికుడిని సమీపంలోని కొవ్వూరు ఆసుపత్రికి తరలించారు. ఫ్యాక్టరీ ఫిల్టర్ క్లీన్ చేస్తున్న సమయంలో ఊపిరాడక కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలంలోనే ఒక కార్మికుడు మరణించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించాడు. మరొకరు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!