
కర్నూలు జిల్లాలో (kurnool district) ఘోర ప్రమాదం సంభవించింది. ఎమ్మిగనూరు (yemmiganur) మండలం ఎర్రకోట (erra kota) వద్ద ఓ కారు బావిలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బావిలో నీరు ఎక్కువగా వుండటంతో .. కారు కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
బావిలోంచి కారును జేసీబీ సహాయంతో బయటకు తీశారు. గజ ఈతగాళ్ల సాయంతో దాన్ని వెలికి తీశారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు కూడా మృత్యువాత పడ్డారు. కారు పడిన బావి రోడ్డుకు 30 అడుగుల దూరంలో ఉంది. అతి వేగం కారణంగానే కారు బావిలో పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు రెండు పల్టీలు కొట్టి బావిలో పడిందని చెబుతున్నారు. కారు నెంబర్ ఏపీ 39 ఎల్ 4059.