దగ్గుబాటి పప్పులో కాలేశారు.. డొక్కా

Published : Jan 29, 2019, 09:31 AM IST
దగ్గుబాటి పప్పులో కాలేశారు.. డొక్కా

సారాంశం

వైసీపీలో చేరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పప్పులో కాలేశారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. 

వైసీపీలో చేరి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పప్పులో కాలేశారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ అన్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుమారుడు హితేష్ వైసీపీలో చేరుతున్న సంగతి తెలిసిందే. 

ఈ విషయంపై  డొక్కా మాణిక్యవర ప్రసాద్ స్పందించారు. చాలా రాజకీయ మలుపులు తిరిగిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు మరో మలుపు తిరిగే అవకాశం లేకుండా చేసుకున్నారని మాణిక్యవరప్రసాద్ చెప్పారు. టీడీపీ ‘జయహో బీసీ’ సభ విజయవంతం కావడంతో బీజేపీ, వైసీపీ నాయకులకు భయం పట్టుకుందని అభిప్రాయపడ్డారు.

బీసీల దృష్టిని మళ్లించేందుకు దగ్గుపాటి వెంకటేశ్వరరావును హుటాహుటిన వైసీపీలో చేర్చుకున్నారని విమర్శించారు. బీజేపీ, వైసీపీలకు కులాల పట్ల ప్రేమ ఉంటే వారి భవిష్యత్ కార్యచరణను ప్రకటించాలని సవాల్ చేశారు.  మోదీని ధైర్యంగా ఎదుర్కొంటున్న నాయకుడు చంద్రబాబు అని.. రాబోయే రోజుల్లో టీడీపీ బలపరిచే పార్టీనే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ జోస్యం చెప్పారు.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం