ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 896 మందికి పాజిటివ్

By Siva Kodati  |  First Published Feb 12, 2022, 7:35 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో 896 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో కరోనా నుంచి 8,849 మంది కోలుకున్నారు. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 24,454 మంది చికిత్స పొందుతున్నారు.


ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 896 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 23,12,029కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల అనంతపురం జిల్లాలో ఇద్దరు.. చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,694కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 8,849 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 22,72,881కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 24,066 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,28,09,000కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 24,454 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 21, చిత్తూరు 52, తూర్పుగోదావరి 206, గుంటూరు 141, కడప 23, కృష్ణ 130, కర్నూలు 23, నెల్లూరు 29, ప్రకాశం 73, శ్రీకాకుళం 8, విశాఖపట్నం 60, విజయనగరం 17, పశ్చిమ గోదావరిలలో 113 చొప్పున వైరస్ బారినపడ్డారు.

Latest Videos

undefined

దేశంలో క‌రోనా కొత్త కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌గా.. మ‌ర‌ణాలు మ‌ళ్లీ పెరిగాయి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త న‌మోదైన క‌రోనా వైర‌స్ కేసులు త‌గ్గ‌గ‌, మ‌ర‌ణాలు స్వ‌ల్పంగా పెరిగాయి.  కొత్తగా50,407 కోవిడ్‌-19 కేసులు వెలుగుచూశాయి. దీంతో  దేశంలో క‌రోనా బారిన‌ప‌డ్డ వారి సంఖ్య మొత్తం 4,25,86,544కు పెరిగింది. ఇదే స‌మ‌యంలో 1,36,962 (RECOVERED) మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కోవిడ్-19 రిక‌వ‌రీల సంఖ్య 4,14,68,120 కి పెరిగింది. ప్ర‌స్తుతం 6,10,443 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

గ‌త 24 గంటల్లో క‌రోనా మ‌హ‌మ్మారితో పోరాడుతూ 804 మంది ప్రాణాలు కోల్పోయారు. అంత‌కు ముందు రోజుతో పోలిస్తే.. మ‌ర‌ణాలు పెరిగాయి. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం 5,07,981 మంది కరోనా వైర‌స్ కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌స్తుతం క‌రోనా రిక‌వ‌రీ రేటు 97.2 శాతంగా ఉండ‌గా, మ‌ర‌ణాల రేటు 1.19 శాతంగా ఉంది. క‌రోనా పాజిటివిటీ రేటు 5.8 శాతంగా ఉంది. దేశంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా న‌మోదైన రాష్ట్రాల జాబితాలో మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, వెస్ట్ బెంగాల్‌, ఢిల్లీ, ఒడిశా, రాజ‌స్థాన్‌, గుజ‌రాత్ లు టాప్ లో ఉన్నాయి. మ‌హారాష్ట్రలో అత్య‌ధికంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 78,35,088 మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. అలాగే, 1,43,355 మంది వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే, గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు అధికంగా కేర‌ళ‌లో న‌మోద‌య్యాయి. కొత్త‌గా కేర‌ళ‌లో 16,012 కేసులు, 492 మ‌ర‌ణాలు చోటుచేసుకున్నాయి. 

 

: 12/02/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,12,029 పాజిటివ్ కేసు లకు గాను
*22,72,881 మంది డిశ్చార్జ్ కాగా
*14,694 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 24,454 pic.twitter.com/RjdP0sEe54

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!