ఏపీకి కాస్త ఉపశమనం: ఒక్కరోజులో 10 వేలకు పైగా డిశ్చార్జ్‌లు

Siva Kodati |  
Published : Aug 15, 2020, 06:08 PM ISTUpdated : Aug 15, 2020, 06:12 PM IST
ఏపీకి కాస్త ఉపశమనం: ఒక్కరోజులో 10 వేలకు పైగా డిశ్చార్జ్‌లు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 8,732 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 8,732 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2,81,817కి చేరింది.

అలాగే 24 గంటల్లో కరోనాతో 87 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 2,562కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో యాక్టివ్ కేసుల సంఖ్య 88,138.. 1,91,117 మంది డిశ్చార్జ్ అయ్యారు.

గడిచిన 24 గంటల్లో 53,712 మందికి పరీక్షలు నిర్వహించారు. వీటితో కలిపి మొత్తం టెస్టుల సంఖ్య 28,12,197కి చేరుకుంది. అయితే ఒక్క రోజులో 10,414 మంది కోలుకోవడం విశేషం.

Also Read:ఒకరి నుంచి ముగ్గురికి కరోనా: ఒక్కొక్కరిగా కుటుంబంలోని నలుగురిని బలి తీసుకున్న మహమ్మారి

కోవిడ్ కారణంగా చిత్తూరు జిల్లాలో 10, గుంటూరు 9, తూర్పుగోదావరి 8, పశ్చిమ గోదావరి 8, అనంతపురం 7, కడప 7, కర్నూలు 7, నెల్లూరు 6, విశాఖపట్నం 6, విజయనగరం 6, ప్రకాశం 5, శ్రీకాకుళం 5, కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున మరణించారు. అలాగే తూర్పు గోదావరి జిల్లాలో 1,126 మందికి పాజిటివ్‌గా తేలింది.

ఆ తర్వాత అనంతపురం 851, చిత్తూరు 959, గుంటూరు 609, కడప 389, కృష్ణా 298, కర్నూలు 734, నెల్లూరు 572, ప్రకాశం 489, శ్రీకాకుళం 638, విశాఖపట్నం 894, విజయనగరం 561, పశ్చిమ గోదావరి జిల్లాలో 612 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?