కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం: వచ్చే నాలుగు రోజులూ రెండు రాష్ట్రాల్లో వానలే

Siva Kodati |  
Published : Aug 15, 2020, 04:56 PM IST
కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం: వచ్చే నాలుగు రోజులూ రెండు రాష్ట్రాల్లో వానలే

సారాంశం

ఉత్తర కోస్తా ఒరిస్సా మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మరియు గాంగేటిక్ పశ్చిమబెంగాల్ ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. 

ఉత్తర కోస్తా ఒరిస్సా మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మరియు గాంగేటిక్ పశ్చిమబెంగాల్ ప్రాంతాలలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధముగా 9.5 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.

ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతీ దిశ వైపుకు వంపు తిరిగి వున్నది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం వుంది. ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో సుమారుగా ఆగస్టు 19 వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

దీని ప్రభావం కారణంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈరోజు, రేపు అనేక చోట్ల మరియు ఎల్లుండి చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

ఈరోజు ఒకటి రెండుచోట్ల భారీ నుండి అతిభారీ వర్షాలతో పాటు అత్యంత భారీవర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు భారీ వర్షాలతో నదులు, చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.

గోదావరి నదికి వరద ప్రవాహం పెరిగింది. గడిచిన మూడు రోజులుగా వరద నీరు క్రమేపి పెరుగుతూ వస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో నీటిమట్టం 43.4 అడుగులకు చేరుకోవడంతో.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

ఇకపోతే మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ అప్రమత్తమయ్యారు. వర్షాలు, వరదల పరిస్థితిపై శనివారం ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న సీఎం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి, మంత్రులతో మాట్లాడారు .భారీ వర్షాల కారణంగా కాల్వలు పొంగిపొర్లుతున్నాయని తెలిపారు.

హైదరాబాద్‌లో రెండు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని.. మంత్రులు జిల్లాల్లో ఉండి పర్యవేక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రమాదం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు