ఏపీలో అంతకంతకూ విజృంభిస్తోన్న కరోనా.. ఒక్కరోజే 840 కేసులు, చిత్తూరులో తీవ్రత

By Siva KodatiFirst Published Jan 7, 2022, 6:58 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 840 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,76,868 కి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 840 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,76,868 కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల విశాఖపట్నంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,501కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 133 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,59,395కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 37,849 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,15,29,919కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 2,972 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 33, చిత్తూరు 150, తూర్పుగోదావరి 70 గుంటూరు 6, కడప 24, కృష్ణ 88, కర్నూలు 23, నెల్లూరు 69, ప్రకాశం 22, శ్రీకాకుళం 25 విశాఖపట్నం 183, విజయనగరం 49, పశ్చిమ గోదావరిలలో 38 చొప్పున వైరస్ బారినపడ్డారు. 

మరోవైపు దేశంలో Corona కేసులు లక్షను దాటాయి. గత 24 గంటల్లో 1.1లక్షల కరోనా  కేసులు నమోదయ్యాయి. కరోనాతో 302 మంది కరోనాతో మరణించారు. కరోనా కేసులు 10 రోజుల వ్యవధిలో 13 రెట్లు పెరిగాయి. కరోనా Omicron కేసులు మూడు వేలకు చేరుకొన్నాయి.  శుక్రవారం నాడు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల మేరకు India లో కరోనా కేసుల సంఖ్య లక్ష దాటడంతో  వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో కరోనా రోగులు 30,836 మంది ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,71,363కి చేరుకొంది. కరోనాతో దేశంలో ఇప్పటివరకు మృతి చెందిన రోగుల సంఖ్య 4,38,178కి చేరుకొంది.  కరోనా ఓమిక్రాన్ కేసుల సంఖ్య 3,007కి పెరిగింది. ఇప్పటివరకు నమోదైన కరోనా ఒమిక్రాన్ కేసుల్లో 1,199 మంది కోలుకొన్నారు. మహారాష్ట్రలో 876, ఢిల్లీలో 465, కర్ణాటకలో 333,రాజస్థాన్ లో 291,కేరళలో 284, గుజరాత్ లో 204 కేసులు నమోదయ్యాయి.

గురువారం నాడు మహారాష్ట్రలో 36,265 కరోనా కేసులు నమోదయ్యాయి. ముంబైలో గత 24 గంటల్లో 31.7 శాతం కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని ఒమిక్రాన్ కేసుల్లో ఎవరికీ కూడా ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సపోర్టు అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖాధికారులు  తెలిపారు. ఢిల్లీలో కరోనా ఒమిక్రాన్ మరణాలు ఎక్కడా లేవని  ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ కూడా ప్రకటించారు.దేశంలో గత 24 గంటల్లో 15, 13, 377 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. అయితే వీరిలో 1,17,100 మందికి కరోనా నిర్ధారణ అయింది.
 

: 07/01/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,76,868 పాజిటివ్ కేసు లకు గాను
*20,59,395 మంది డిశ్చార్జ్ కాగా
*14,501 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 2,972 pic.twitter.com/Si5NN8TdUx

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!