
రఘురామ కృష్ణంరాజు (raghu rama krishnam raju) రాజీనామా చేయాలని మేము ముందు నుంచీ కోరుతున్నామన్నామని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన రాజీనామా చేస్తేనే ఎవరేమిటో ప్రజలకు తెలుస్తుందని పేర్కొన్నారు. పవన్ తో పొత్తు కోసం చంద్రబాబు చకోర పక్షిలాగా ఎంతగానో ఎదురు చూస్తున్నారంటూ రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ (pawan kalyna) పట్ల చంద్రబాబు (chandrababu naidu) వన్ సైడ్ లవ్ ప్రదర్శిస్తున్నారని.. అవసాన దశలో ఉన్న చంద్రబాబు పరిస్ధితి చూస్తే జాలేస్తోందంటూ సజ్జల దుయ్యబట్టారు. 1 లక్ష 30 వేల గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలను ఏ ప్రభుత్వమూ ఇచ్చి ఉండదని ఆయన అన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలనూ సీఎం జగన్ నెరవేర్చారని.. అత్యుత్తమ పీఆర్సీ అమలు చేసిన సీఎంగా వైఎస్ జగన్ నిలిచిపోతారని సజ్జల ప్రశంసించారు.
ఏదైనా నిజాయితీగా చేయడం సీఎం జగన్మోహన్ రెడ్డికి (ys jagan) అలవాటన్నారు రామకృష్ణారెడ్డి (sajjala rama krishna reddy). 2014లో చంద్రబాబు నాయుడు రుణమాఫీ హామీ ఇచ్చారని.. కానీ జగన్ మాత్రం అలాంటి హామీ ఇవ్వలేనని చెప్పారన్నారు. హామీ నెరవేర్చలేకపోతే తాను తలెత్తుకోలేనని... రాజకీయాల్లో కూడా వుండలేనని, తాను అధికారంలో వుండటం కోసం తాను రాజకీయాల్లో లేనని జగన్ చెప్పారని సజ్జల గుర్తుచేశారు. తనకు లక్ష్యం వుందని.. నా నిజాయితీ, నిబద్ధత నిరూపించుకోవాలని భావిస్తున్నట్లు అప్పుడు జగన్ చెప్పారని సజ్జల వెల్లడించారు.
అప్పుడు చంద్రబాబు అబద్ధపు హామీ ఇవ్వడం వల్లే గెలిచారని రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. చెప్పినదాని కన్నా ఎక్కువ చేయాలని జగన్‌కు వుండేదని.. పరిస్ధితులు పూర్తి ప్రతికూలంగా వున్నాయని సజ్జల తెలిపారు. ఉద్యోగులందరూ మన టీంలో భాగమని.. ఈ పెద్ద రథం నడిస్తేనే పరిపాలన సజావుగా సాగుతుందని జగన్ భావించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం మొత్తాన్ని సుభిక్షం చేసే పథకాలను అధికారులు, ఉద్యోగుల అండదండలతోనే అమలు చేయగలమన్నది జగన్ ఉద్దేశ్యమన్నారు. అందువల్లే పీఆర్సీ ఆలస్యమైందని సజ్జల వెల్లడించారు. అన్ని లెక్కలు చూసి జగన్ పీఆర్సీ ప్రకటించారని సజ్జల పేర్కొన్నారు.
కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ 23.25 శాతం ఫిట్‌మెంట్ ను ఇవ్వనున్నట్టుగా ప్రకటించింది. ఉద్యోగ సంఘాలతో శుక్రవారం నాడు సీఎం జగన్ సమావేశమయ్యారు.ఈ సమావేశంలో 23.29 శాతం ఫిట్‌మెంట్ ఇస్తామని జగన్ ప్రకటించారు.
శుక్రవారం నాడు మధ్యాహ్నం ఉద్యోగ సంఘాలతో ఏపీ సీఎం Ys Jagan భేటీ అయ్యారు.ఈ సమావేశానికి ముందే ఏపీ సీఎం జగన్ ఆర్ధిక శాఖాధికారులతో సమావేశమయ్యారు.ఈ సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు పిలిచారు.
నిన్ననే ఉద్యోగ సంఘాల నేతలతో జగన్ చర్చించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు తమ అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన అభిప్రాయాలను సీఎం నోట్ చేసుకొన్నారు. ఇవాళ మరోసారి ఉద్యోగ సంఘాల నేతలను పిలిపించి Prc ఫిట్‌మెంట్ 23.29 శాతం ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఏపీలో ఉద్యోగుల Retirement వయస్సు 60 నుండి 62 శాతానికి పెంచుతామని సీఎం జగన్ హామీ ఇచ్చారు.
ఈ ఏడాది జూన్ 30 లోపుగా కారుణ్య నియామకాలను చేపడుతామని సీఎం హామీ ఇచ్చారు. పెంచిన జీతాలను ఈ నెల నుండి అమల్లోకి వస్తాయని సీఎం హామీ ఇచ్చారు.2020 ఏప్రిల్ నుండి మానిటరీ బెనిఫిట్ అమలు చేస్తామని కూడా సీఎం ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు.ఈహెచ్ఎస్ సమస్యల పరిష్కారానికి సీఎస్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తామని కూడా సీఎం జగన్ చెప్పారు. రెండు వారాల్లో employees సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని జగన్ స్పష్టం చేశారు.