కొత్తగా 82 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,89,585కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Feb 25, 2021, 05:35 PM ISTUpdated : Feb 25, 2021, 05:36 PM IST
కొత్తగా 82 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,89,585కి చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 82 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,89,585కి చేరింది

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 82 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,89,585కి చేరింది.

వైరస్ వల్ల నిన్న ఎవ్వరూ ప్రాణాలు కోల్పోలేదు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి మరణించిన వారి సంఖ్య 7,168కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 611కి చేరింది.

గడిచిన 24 గంటల్లో 74 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,81,806కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు 35,443 మందికి కరోనా నిర్థారణా పరీక్షలు చేయగా.. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ టెస్టుల సంఖ్య 1,38,43,190కి చేరుకుంది.

గత 24 గంటల్లో అనంతపురం 5, చిత్తూరు 21, తూర్పుగోదావరి 5, గుంటూరు 8, కడప 4, కృష్ణా 7, కర్నూలు 8, నెల్లూరు 6, ప్రకాశం 1, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 7, విజయనగరం 0, పశ్చిమ గోదావరిలలో 5 కేసులు చొప్పున నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu