ఏపీలో 2 లక్షలు దాటిన డిశ్చార్జ్‌లు: కొత్తగా 8,012 కేసులు, 88 మరణాలు

By Siva KodatiFirst Published Aug 16, 2020, 7:12 PM IST
Highlights

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,012 మందికి పాజిటివ్‌గా తేలినట్లుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,89,829కి చేరింది

ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 8,012 మందికి పాజిటివ్‌గా తేలినట్లుగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,89,829కి చేరింది.

గత 24 గంటల్లో 88 మంది కరోనాతో కన్నుమూశారు. వీటితో కలిపి మొత్తం మృతుల సంఖ్య 2,650కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 85,945 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న ఒక్క రోజే 10,117 మంది కోలుకున్నారు.

దీంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 2,01,324కి చేరింది. ఇక టెస్ట్‌ల విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో 48,746 శాంపిల్స్‌ను పరీక్షించగా.. మొత్తం పరీక్షల సంఖ్య 28,60,943కి చేరుకుంది.

Also Read:కరోనా రోగుల అంత్యక్రియల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

చిత్తూరులో 10, తూర్పుగోదావరిలో 10, కర్నూలు 9, నెల్లూరు 9, అనంతపురం 8, పశ్చిమ గోదావరి 8, విశాఖపట్నం 7, గుంటూరు 6, కడప 6, ప్రకాశం 4, శ్రీకాకుళం 4, విజయనగరం 4, కృష్ణా జిల్లాలో ముగ్గురు చొప్పున మరణించారు.

తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,126 కేసులు నమోదయ్యాయి. అనంతపురం 851, చిత్తూరు 959, గుంటూరు 609, కడప 389, కృష్ణ 298, కర్నూలు 734, నెల్లూరు 72, ప్రకాశం 489, శ్రీకాకుళం 638, విశాఖపట్నం 894, విజయనగరం 561, పశ్చిమ గోదావరిలలో 612 కేసులు నమోదయ్యాయి. 

click me!