తెలంగాణ నుండి ఏపీకి రూ. 6లక్షల మద్యం తరలింపు: బీజేపీ నేత అరెస్ట్

By narsimha lodeFirst Published Aug 16, 2020, 5:43 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 6 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. 

గుంటూరు: తెలంగాణ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి రూ. 6 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకొన్నారు. 

తెలంగాణతో పోలిస్తే ఏపీ రాష్ట్రంలో మద్యం ధరలు ఎక్కువ. దీంతో తెలంగాణలో మధ్యం కొనుగోలు చేసి ఏపీ రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. ఇటీవల కాలంలో ఏపీ , తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల్లో భారీగా మద్యాన్ని పోలీసులు పట్టుకొంటున్నారు.

ఆదివారం నాడు కూడ గుంటూరుకు అక్రమంగా మద్యాన్ని తరలిస్తుండగా పోలీసులు పట్టుకొన్నారు.  మొత్తం ముగ్గురు నిందితులు రూ. 6 లక్షల విలువైన మద్యాన్ని తరలిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. నిందితుల నుండి  రెండు కార్లు స్వాధీనం చేసుకొన్నారు.

తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో బీజేపీ నేత జి. రామాంజనేయులు, మచ్చా సురేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

మద్య నియంత్రణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  33 శాతం మద్యం దుకాణాలను మూసివేసింది. అంతేకాదు మద్యం ధరలను భారీగా పెంచారు. దీంతో ఇతర రాష్ట్రాల నుండి ఏపీలోకి  మద్యం తరలించి సొమ్ము చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

దశలవారీగా మద్యాన్ని నిషేధిస్తామని వైఎస్ జగన్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అయితే ఈ హామీ మేరకు రాష్ట్రంలో మద్యం ధరలను రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా పెంచింది. 

click me!