షాకింగ్.. 80యేళ్ల వృద్ధురాలిపై పందుల దాడి, కన్ను, చెవి, చేతివేళ్లు కొరికడంతో మృతి..

By SumaBala BukkaFirst Published Sep 24, 2022, 10:57 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ 80 యేళ్ల వృద్ధురాలిపై పందులు దాడి చేసి చంపేశాయి. 

అనంతపురం : అన్నమయ్య జిల్లా బ్రహ్మంగారి మఠంలో శుక్రవారం పందులు దాడి చేయడంతో 80 ఏళ్ల వృద్ధురాలు మృతి చెందింది. సిద్దమ్మ ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో పందులు దాడి చేశాయి. "మహిళ కన్నును పందులు పూర్తిగా నమిలేశాయి. ఆమె అరచేతులతో పాటు ఆమె వేళ్లు కూడా కొరికేశాయి" అని సమాచారం.

పందుల దాడిని గమనించిన చుట్టుపక్కల ప్రజలు, ఆమె కుటుంబ సభ్యులు మహిళను రక్షించేందుకు ఘటనాస్థలికి చేరుకునేసరికే ఈ ఘోరం జరిగిపోయింది. వెంటనే పందులను తరిమికొట్టిన ఆమెను స్థానిక బ్రహ్మంగారి మఠం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది.

మార్చెయ్యటానికీ ఎన్టీఆర్ అన్నది పేరు కాదు.. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త..: నందమూరి బాలకృష్ణ హెచ్చరిక

బ్రహ్మంగారి మఠంలోని తపాలా కార్యాలయం వీధిలో నాగిరెడ్డి సిద్దమ్మ (80) నివసిస్తోంది. రోజూలాగే ఆమె ఆరుబయట మంచంమీద నిద్రిపోతోంది. ఉదయం పదిగంటల సమయంలో టిఫిన్ పెట్టాలని.. అది తయారుచేయడానికి కాసేపటి క్రితమే కూతురు ఇంట్లోకి వెళ్లింది. ఆ సమయంలోనే పందుల గుంపు సిద్ధమ్మ మీద దాడి చేసింది. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. ఇంటి బయట అలికిడి విని కూతురు బయటికి వచ్చేసరికి.. జరుగుతున్న దారుణం కనిపించింది. వెంటనే గట్టిగా కేకలు వేయడం ఇరుగు,పొరుగు వారు వచ్చి పందులను తరిమేశారు. 

టెంపుల్ టౌన్ లో పందుల బెడదను నియంత్రించడంలో స్థానిక పౌర అధికారులు విఫలమయ్యారని బ్రహ్మగారి మఠం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో పందులను నియంత్రించాలని గ్రామపంచాయతీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు.శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దర్శనం కోసం ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. కానీ ఇప్పటి వరకు కనీస భద్రతా చర్యలు చేపట్టలేదని వాపోయారు.

click me!