ఏపీ అసెంబ్లీ: నాలుగో రోజు 8 మంది టీడీపీ ఎమ్మెల్యే ల సస్పెన్షన్

Published : Dec 03, 2020, 01:08 PM ISTUpdated : Dec 03, 2020, 01:15 PM IST
ఏపీ అసెంబ్లీ:  నాలుగో రోజు 8 మంది టీడీపీ ఎమ్మెల్యే ల సస్పెన్షన్

సారాంశం

ఏపీ అసెంబ్లీ నుండి నాలుగో రోజున కూడ టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుండి సస్పెండ్ అయ్యారు. గత మూడు రోజులుగా టీడీపీ సభ్యులు సస్పెండైన విషయం తెలిసిందే.

అమరావతి: ఏపీ అసెంబ్లీ నుండి నాలుగో రోజున కూడ టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుండి సస్పెండ్ అయ్యారు. గత మూడు రోజులుగా టీడీపీ సభ్యులు సస్పెండైన విషయం తెలిసిందే.ఎమ్మెల్యే రాజన్నదొర మాట్లాడకుండా టీడీపీ సభ్యులు అడ్డుకొన్నారు. ఈ సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు  స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. 

also read:పోలవరంపై చర్చ: ఏపీ అసెంబ్లీ నుండి 9 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ నుండి గురువారం నాడు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, వీరాంజనేయులు, వెలగపూడి రామకృష్ణబాబు, ఎం.రామరాజు, బెందాళం ఆశోక్, జోగేశ్వరరావు, అనగాని సత్యప్రసాద్  సస్పెండ్ అయ్యారు. ఇవాళ ఒక్కరోజు అసెంబ్లీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ను నిరసిస్తూ  అసెంబ్లీ నుండి చంద్రబాబునాయుడు వాకౌట్ చేశారు.

నవంబర్ 30వ తేదీన రైతుల సమస్యలపై టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన నిర్వహించారు. దీంతో చంద్రబాబు సహా 16 మందిని సభ నుండి సస్పెండ్ చేశారు. డిసెంబర్ 1వ తేదీన టిడ్కో ఇళ్లపై జరిగిన చర్చ సందర్భంగా ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకొంది. చంద్రబాబు మినహా 15 మంది ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గరయ్యారు. అదే రోజున టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడను సభ నుండి సస్పెండ్ చేశారు.

డిసెంబర్ 2వ తేదీన అసెంబ్లీ నుండి చంద్రబాబు మినహా 9 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఇవాళ చంద్రబాబు మినహా 8 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. 


 


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: ఎన్టీఆర్ ఒక చరిత్ర సృష్టించారు చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
Minister Gottipati Ravi Kumar: వైసీపీ పై మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఫైర్ | Asianet News Telugu