జగన్ సర్కార్ కు చుక్కెదురు: స్థానిక సంస్థల ఎన్నికలపై స్టేకి నిరాకరణ

Published : Dec 03, 2020, 12:53 PM ISTUpdated : Dec 03, 2020, 12:57 PM IST
జగన్ సర్కార్ కు చుక్కెదురు: స్థానిక సంస్థల ఎన్నికలపై  స్టేకి నిరాకరణ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది.  

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది.

వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసంలో  స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహలు చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గనందున స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సుముఖంగా లేదు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం హైకోర్టును కోరింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్టే ఇచ్చేందుకు  ఏపీ హైకోర్టు నిరాకరించింది.

ప్రభుత్వాన్ని సంప్రదించకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమైందని దాఖలైన పిల్ పై ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది.కరోనాతో ఇప్పటికే అనేక మంది మరణించారని పిటిషన్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

వైద్యశాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని ఎన్నికల సంఘం ప్రకటించింది.సుప్రీంకోర్టు ఆదేశాలను తమ ముందుంచాలని హైకోర్టు ఆదేశించింది.


 

 


 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu