ప్రారంభమైన ఏపీ కేబినెట్:నిమ్మగడ్డ సహా పలు కీలకాంశాలపై చర్చ

By narsimha lodeFirst Published Jun 11, 2020, 11:25 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం నాడు ప్రారంభమైంది.సోషల్ డిస్టెన్స్ కోసం వీడియో కాన్పరెన్స్ ద్వారా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకొనే అవకాశం ఉంది. 


అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన గురువారం నాడు ప్రారంభమైంది.సోషల్ డిస్టెన్స్ కోసం వీడియో కాన్పరెన్స్ ద్వారా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకొనే అవకాశం ఉంది. 

ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు వైఎస్ఆర్ చేయూత పథకంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. చిరు వ్యాపారులకు ప్రభుత్వం అందించే సహాయంపై చర్చిస్తారు. 

ఈ నెల 16వ తేదీ నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని భావించారు. అయితే కరోనా నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ ను పాటిస్తూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ఎలా అనే అభిప్రాయాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడ కేబినెట్ చర్చించనుంది.

నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు నాలుగు రంగులు, ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం తదితర విషయాలపై కూడ కేబినెట్ చర్చించే ఛాన్స్ ఉంది.

కురుపాం ఇంజనీరింగ్, మూడు నర్సింగ్ కాలేజీలకు కూడ మంత్రివర్గం ఆమోదం తెలిపే ఛాన్స్ లేకపోలేదు. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలను భర్తీకి, స్పెషల్ ఎన్‌ఫోర్స్ మెంట్ బ్యూరోకు కూడ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది.

కరోనా నియంత్రణ చర్యలపై కూడ ప్రభుత్వం చర్చించనుంది. అంతేకాదు రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న ఇళ్లపట్టాల పంపిణీపై కూడ మంత్రివర్గంలో చర్చ జరగనుంది. ఈ సమావేశంలో సుమారు 40 అంశాలపై కేబినెట్ చర్చించనుంది.


 

click me!