కొత్తగా 70 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,89,409కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Feb 23, 2021, 09:50 PM IST
కొత్తగా 70 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,89,409కి చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పడిపోతూనే వున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 70 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 8,89,409కి చేరింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పడిపోతూనే వున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 70 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 8,89,409కి చేరింది.

కోవిడ్ వల్ల విశాఖలో ఒకరు మరణించారు. దీంతో కలిపి కరోనా బారినపడి ఇప్పటి వరకు ఏపీలో మరణించిన వారి సంఖ్య 7,168కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 575కి చేరింది.

గడిచిన 24 గంటల్లో 84 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు డిశ్చార్జ్‌ల సంఖ్య 8,81,666కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు 28,268 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. వీరితో కలిపి ఇప్పటి వరకు ఏపీలో కోవిడ్ టెస్టుల సంఖ్య 1,37,75,253కి చేరుకుంది. గ

డిచిన 24 గంటల్లో అనంతపురం 2, చిత్తూరు 18, తూర్పుగోదావరి 9, గుంటూరు 5, కడప 1, కృష్ణ 7, కర్నూలు 0, నెల్లూరు 6, ప్రకాశం 2, శ్రీకాకుళం 4, విశాఖపట్నం 9, విజయనగరం 3, పశ్చిమ గోదావరిలలో నలుగురికి వైరస్ సోకింది. 

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?