ఏపీలో కరోనా విజృంభణ.... కొత్తగా 6996 కేసులు, ఒక్క చిత్తూరులోనే 1534 మందికి పాజిటివ్

Siva Kodati |  
Published : Jan 18, 2022, 05:39 PM IST
ఏపీలో కరోనా విజృంభణ.... కొత్తగా 6996 కేసులు, ఒక్క చిత్తూరులోనే 1534 మందికి పాజిటివ్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 6,996 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 21,14,489కి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 6,996 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 21,14,489కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల విశాఖపట్నంలో ఇద్దరు, చిత్తూరు, నెల్లూరులలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,514కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 1,066 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,63,867కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 38,055 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,19,22,969కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 36,108 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 462, చిత్తూరు 1534, తూర్పుగోదావరి 292, గుంటూరు 758, కడప 202, కృష్ణ 326, కర్నూలు 259, నెల్లూరు 246, ప్రకాశం 424, శ్రీకాకుళం 573, విశాఖపట్నం 1263, విజయనగరం 412, పశ్చిమ గోదావరిలలో 245 చొప్పున వైరస్ బారినపడ్డారు. 

మరోవైపు భారత్‌లో గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 2,38,018  కరోనా కేసుల నమోదయ్యాయి. అయితే గత రెండు రోజులుగా కరోనా కొత్త కేసుల సంఖ్య తగ్గడం కొద్దిగా ఊరట కలిగించే అంశమని చెప్పాలి. తాజాగా 310 కరోనాతో మంది మరణించారు. దీంతో కరోనాతో మొత్తం మరణాల సంఖ్య 4,86,761కి చేరింది. నిన్న కరోనా నుంచి 1,57,421 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనాను జయించిన వారి సంఖ్య 3,53,94,882 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 17,36,628 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

దేశంలో కరోనా రోజువారి పాజిటివిటీ రేటు 14.43 శాతంగా ఉన్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు.. 94.09 శాతం, యాక్టివ్ కేసులు.. 4.62 శాతంగా ఉంది. ఇక, శనివారం (జనవరి 15) రోజున దేశంలో 16,49,143 శాంపిల్స్‌ను పరీక్షించినట్టుగా ఐసీఎంఆర్ వెల్లడించింది. దీంతో దేశంలో ఇప్పటివరకు పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 70,54,11,425కి చేరినట్టుగా తెలిపింది. 

మరోవైపు దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. నిన్న దేశంలో 79,91,230 డోసుల వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,58,04,41,770కి చేరింది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. ఇప్పటివరకు దేశంలో 8,891 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టుగా తెలిపింది. 

 

PREV
click me!

Recommended Stories

Nara Bhuvaneshwari: అల్లూరి జిల్లాలో పోలియో వేసిన నారా భువనేశ్వరి | Asianet News Telugu
YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu