ఇది రివర్స్ పీఆర్సీ.. ఉద్యోగుల కోసం రేపు ఢిల్లీలో నిరాహార దీక్ష : రఘురామ

By Siva KodatiFirst Published Jan 18, 2022, 4:51 PM IST
Highlights

ఏపీ సర్కారు ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉద్యోగులకు మద్దతు పలికారు.

ఏపీ సర్కారు ప్రకటించిన పీఆర్సీపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వారు మరోసారి ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉద్యోగులకు మద్దతు పలికారు. రివర్స్ పీఆర్సీకి నిరసనగా రేపు ఢిల్లీలో నిరాహార దీక్ష చేస్తానని రఘురామ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తన నివాసంలోనే దీక్ష చేపడతానని ఆయన పేర్కొన్నారు. 

ఉద్యోగులకు సీఎం జగన్ రివర్స్ పీఆర్సీ కానుక ఇచ్చారని రఘురామ సెటైర్లు వేశారు. ఇలాంటి కోతలు చరిత్రలో ఎప్పుడూ చూడలేదని వెల్లడించారు. ఈ పీఆర్సీపై ఉద్యోగ సంఘాలన్నీ అసంతృప్తితో ఉన్నాయని చెప్పారు. ఈ అంశంలో తాను ఉద్యోగులకు సంఘీభావం ప్రకటిస్తున్నానని, రాష్ట్ర ప్రజలు కూడా ఉద్యోగులకు అండగా వుండాలని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. 

కాగా.. Andhra Pradesh  ముఖ్యమంత్రితో ఉద్యోగ సంఘాల నేతలు ఈ నెల 7వ తేదీన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 23.29 శాతం పీఆర్సీ ఫిట్‌మెంట్ ఇస్తామని సీఎం Ys Jagan హామీ ఇచ్చారు. అంతేకాకుండా పెండింగ్ లోని ఐదు D.A లను ఒకే సారి ఇస్తామని హమీ ఇచ్చారు. ఫిట్‌మెంట్ కనీసం 27 శాతానికి తగ్గకుండా ఉండాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే పెండింగ్ డిఏలు ఒకేసారి ఇస్తామని హమీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు సానుకూలంగా స్పందించాయి.

ఈ భేటీ తర్వాత Hraవిషయమై Chief Secretary నేతృత్వంలోని కమిటీతో ఉద్యోగ సంఘాలు సంక్రాంతి పర్వదినం కంటే ముందే పలు దఫాలు భేటీ అయ్యారు. కానీ ఈ సమావేశాల్లో ఉద్యోగ సంఘాల డిమాండ్ పై ప్రభుత్వం నుండి స్పష్టత రాలేదు.  అయితే ఈ నెల 17వ తేదీ రాత్రి పీఆర్సీపై  ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. ఈ జీవోల్లో హెచ్ఆర్‌ఏను భారీగా తగ్గించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. 30 శాతంగా ఉన్న హెచ్ఆర్ఏ స్థానంలో 16 శాతం హెచ్ఆర్ఏ ఇవ్వడంతో తాము 14 శాతం నష్టపోతున్నామని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు.

ఈ విషయమై సీఎంఓ అధికారులతో ఉద్యోగ సంఘాల నేతలు భేటీ అయ్యారు. సచివాలయ ఉద్యోగుల సంఘం నేత Venkatram Reddy  సీఎంఓ అధికారులతో ఈ విషయమై చర్చించారు. హెచ్ఆర్ఏ తగ్గించడంతో పాటు CCA ల్లో కూడా కోత విధించడాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.గతంలో వచ్చే Salary కంటే కొత్త పీఆర్సీని అమలు చేస్తే గతంలో కంటే జీతాలు తగ్గనున్నాయి. దీంతో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు సిద్దమౌతున్నాయి. అన్ని ఉద్యోగ సంఘాలు సమావేశమై ఆందోళన కార్యక్రమాలను ఖరారు చేయనున్నాయి. 

అయితే ఈ ఆందోళన కార్యక్రమాలకు ముందే ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లాలని  ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు.ఈ క్రమంలోనే సీఎంఓ అధికారులతో సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి భేటీ అయ్యారు. సీఎంతో సమావేశం కావడానికి ఉద్యోగ సంఘాలకు అపాయింట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ విషయమై తమకు ప్రభుత్వం నుండి స్పష్టత రాకపోతే Protest తప్పదని ఉద్యోగ సంఘాలు హెచ్చరిస్తున్నాయి.ప్రభుత్వం జారీ చేసిన జీవోలతో  ఉద్యోగ సంఘాల అసంతృప్తితో పీఆర్సీ అంశం మళ్లీ మొదటికొచ్చింది.
 

click me!