ఏపీలో భారీగా పడిపోయిన కరోనా కేసులు.. కొత్తగా 675 మందికి పాజిటివ్

By Siva Kodati  |  First Published Feb 16, 2022, 6:59 PM IST

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో 675 మందికి మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో కరోనా నుంచి 2,414 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 22,88,989కి చేరింది


ఆంధ్రప్రదేశ్‌‌‌లో (corona cases in ap) కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 675 మందికి మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 23,14,502కి చేరుకుంది. నిన్న మహమ్మారి వల్ల చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,705కి చేరుకుంది. 

24 గంటల్లో కరోనా నుంచి 2,414 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 22,88,989కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 24,663 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 3,28,93,908కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 10,808 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 32, చిత్తూరు 68, తూర్పుగోదావరి 143, గుంటూరు 55, కడప 27, కృష్ణ 64, కర్నూలు 16, నెల్లూరు 28, ప్రకాశం 42, శ్రీకాకుళం 5, విశాఖపట్నం 57, విజయనగరం 8, పశ్చిమ గోదావరిలలో 130 చొప్పున వైరస్ బారినపడ్డారు.

Latest Videos

undefined

కాగా.. కరోనావైరస్ ఓమిక్రాన్ వేరియంట్  ప్ర‌భావం యూరోపియ‌న్ (Europe) దేశాల్లో ఇంకా కొన‌సాగుతున్న‌ద‌ని తెలిపింది. కొత్త కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయ‌ని ఈ విష‌యాన్ని తేలిక‌గా తీసుకోవ‌ద్ద‌నీ, ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు త‌గ్గిపోలేద‌ని తెలిపింది. ఒమిక్రాన్ వేరియంట్ కొత్త  కోవిడ్‌-19 వేవ్ ఐరోపాకు తూర్పు వైపు కదులుతున్నట్లు WHO తెలిపింది. ఈ ప‌రిస్థితులు దారుణంగా మార‌కుండా.. కోవిడ్-19 క‌ట్ట‌డి ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో వేగం పెంచాల‌ని తెలిపింది. 

అంద‌రికీ కోవిడ్‌-19 టీకాలు అందేలా చూడాల‌ని సూచించింది. గత రెండు వారాల క‌రోనా వైర‌స్ గ‌ణాంకాల‌ను గ‌మ‌నిస్తే..  ఆర్మేనియా, అజర్‌బైజాన్, బెలారస్, జార్జియా, రష్యా, ఉక్రెయిన్ వంటి దేశాల్లో కోవిడ్‌-19 కొత్త కేసులు రెండింతలు పెరిగాయని డబ్ల్యూహెచ్‌వో యూరప్ ప్రాంతీయ డైరెక్టర్ హన్స్ క్లూగే ఒక ప్రకటనలో తెలిపారు. రోజువారీ కేసులే తగ్గుతూ ఉంటే వచ్చే నెలలో ఇప్ప‌టికీ కొన‌సాగుతున్న కోవిడ్ ఆంక్ష‌ల‌ను సడలించాలని అనేక యూరోపియన్ దేశాలు సూచించిన సమయంలో ఆయ‌న‌ ఈ వ్యాఖ్యలు  చేయ‌డం ప్ర‌ధాన్య‌త సంత‌రించుకుంది. 

World Health Organization (WHO) యూరప్ ప్రాంతీయ డైరెక్టర్ హన్స్ క్లూగే మాట్లాడుతూ.. మున్ముందు తూర్పు యూర‌ప్ దేశాల్లో మ‌రింత‌గా విజృంభించ‌కుండా తీసుకునే ముంతు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో కోవిడ్‌-19 ప‌రీక్ష‌లు, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్ర‌ముఖ పాత్ర పోషిస్తుంద‌ని తెలిపారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌డం, భౌతిక దూరం, మాస్కులు ధ‌రించడం కీల‌క‌మ‌ని పేర్కొన్నారు. కాగా, యూరోపియన్ ప్రాంతంలో ఇప్పటివరకు 165 మిలియన్లకు పైగా COVID-19 కేసులు నమోదయ్యాయి.  

గత వారంలో ఏకంగా 25,000 మంది మరణించారు. "ఓమిక్రాన్ టైడల్ వేవ్‌ను ఎదుర్కొంటున్నప్పుడు.. డెల్టా ఇప్పటికీ తూర్పున విస్తృతంగా వ్యాపిస్తున్న త‌రుణంలో.. మ‌రోవైపు ఒమిక్రాన్ వ్యాప్తి ఈ ప్రాంతం దిశ‌గ క‌దులుతున్న పరిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. ఇప్పుడే కోవిడ్ ఆంక్ష‌లు ఎత్తివేతకు స‌రైన స‌మ‌యం కాదు" అని క్లూగే చెప్పారు. తక్కువ టీకా రేటుకు స్థానిక కారణాలను పరిశీలించాలని ఆయన ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. బోస్నియా మరియు హెర్జెగోవినా, బల్గేరియా, కిర్గిజ్‌స్థాన్, ఉక్రెయిన్ మరియు ఉజ్బెకిస్తాన్‌లలో 60 సంవ‌త్స‌రాలు పైబడిన వారిలో 40 శాతం కంటే తక్కువ మంది తమ కోవిడ్-19 వ్యాక్సిన్ల‌ను అందుకున్నార‌ని చెప్పారు.
 

: 16/02/2022, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,14,502 పాజిటివ్ కేసు లకు గాను
*22,88,989 మంది డిశ్చార్జ్ కాగా
*14,705 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10,808 pic.twitter.com/kGxMiu4wvS

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!