విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు

Published : Feb 16, 2022, 05:33 PM ISTUpdated : Feb 16, 2022, 05:36 PM IST
విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు జరిపారు. సచివాలయంలో తన ఛాంబర్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బాలినేని భేటి అయ్యారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఇచ్చిన  నోటీసులోని అంశాలపై వారితో చర్చిస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలతో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు జరిపారు. సచివాలయంలో తన ఛాంబర్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి బాలినేని భేటి అయ్యారు. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఇచ్చిన  నోటీసులోని అంశాలపై వారితో చర్చిస్తున్నారు. గత నెల 28న విద్యుత్ ఉద్యోగ సంఘాల జేఏసీ 24డిమాండ్లతో ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రం ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఉద్యోగుల జేఏసీ నోటీసు అందించింది. విద్యుత్ ఉద్యోగుల వేతనాలపై ఏర్పాటు చేసిన పీఆర్సీను జేఏసీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. 

పీఆర్సీ బాధ్యతలను విద్యుత్ సంస్థలకు చెందిన ఉన్నతాధికారులకే ఇవ్వాలని నోటీసులో డిమాండ్ చేసింది. విద్యుత్ సంస్థల్లో పని చేస్తోన్న ఔట్ సోర్సింగ్,కాంట్రాక్ట్ కార్మికుల సర్వీసులను రెగ్షులర్ చేయాలని కోరింది. ఉద్యోగులు  వారి కుటుంబాలకు అపరిమిత వైద్యం అందించాలని డిమాండ్ చేసింది. విద్యుత్ సంస్థలో కారుణ్య నియామకాలు చేపట్టాలని నోటీసులో పేర్కొంది. విద్యుత్ ఉద్యోగులపై వేధింపులు ఆపడం, తదితర సమస్యలను జేఏసీ ప్రభుత్వానికి ఇచ్చిన నోటీసులో ప్రస్తావించింది. ఈ క్రమంలోనే నోటీసులో ఇచ్చిన డిమాండ్ల పరిష్కారంపై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉద్యోగ సంఘాల నేతలతో చర్చిస్తున్నారు.

ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని Genco ఉద్యోగులు తమ ఆందోళన కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేశారు.ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం నుండి హామీ వచ్చింది. దీంతో ఆందోళనలకు తాత్కాలికంగా వాయిదా వేయాలని జేఎసీ నిర్ణయం తీసుకొంది. కృష్ణపట్నం విద్యుదుత్పత్తి కేంద్రం ప్రైవేటీకరణపై యథాతథంగా ఆందోళన కొనసాగుతోంది. విద్యుత్‌ ఉద్యోగుల డిమాండ్లపై చర్చలకు రావాలని ఏపీ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి Balineni Srinivas Reddy ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్