ఏపీలో కరోనా జోరు: 7,13,014కి చేరిన కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Oct 03, 2020, 06:21 PM IST
ఏపీలో కరోనా జోరు: 7,13,014కి చేరిన కేసుల సంఖ్య

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,224 కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 7,13,014కి చేరింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,224 కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 7,13,014కి చేరింది. నిన్న ఒక్కరోజే వైరస్ కారణంగా 41 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 5,941కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో 7,798 మంది కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,51,791కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 55,282 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న 72,861 శాంపిల్స్ పరీక్షంచడంతో ఇప్పటి వరకు మొత్తం టెస్టుల సంఖ్య 60,21,395కి చేరింది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 282, చిత్తూరు 827, తూర్పు గోదావరి 824, గుంటూరు 491, కడప 491, కృష్ణ 392, కర్నూలు 225, నెల్లూరు 558, ప్రకాశం 619, శ్రీకాకుళం 175, విశాఖపట్నం 225, విజయనగరం 225, పశ్చిమ గోదావరిలలో 890 కేసులు నమోదయ్యాయి.

అలాగే కృష్ణ 6, చిత్తూరు 5, తూర్పు గోదావరి 5, గుంటూరు 4, ప్రకాశం 4, విశాఖపట్నం 4, నెల్లూరు 3, అనంతపురం 2, కడప 2, కర్నూలు 2, శ్రీకాకుళం 2, విజయనగరం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. 

 

PREV
click me!

Recommended Stories

లోకేష్ ని ఆటపట్టిస్తున్న పిల్లలు | Nara Lokesh | Asianet News Telugu
😂 Student Hilarious Reply To Nara Lokesh |లోకేష్ కే పంచు వేసిన బుడ్డోడు | Asianet News Telugu