కొత్తగా 60 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,88,959కి చేరిన కేసులు

Siva Kodati |  
Published : Feb 16, 2021, 08:10 PM IST
కొత్తగా 60 మందికి పాజిటివ్.. చిత్తూరులో అత్యధికం: ఏపీలో 8,88,959కి చేరిన కేసులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల నమోదవుతూనే వుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 60 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,88,959కి చేరింది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల నమోదవుతూనే వుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 60 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,88,959కి చేరింది.

నిన్న ఒక్కరోజు కరోనా కారణంగా ఏ ఒక్కరూ మరణించలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 7,163 మంది కోవిడ్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు రాష్ట్రంలో 140 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

దీంతో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,81,181కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 615 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 24,311 మందికి కరోనా నిర్థారణా పరీక్షలు నిర్వహించగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,35,89,373 మందికి టెస్టులు నిర్వహించినట్లయ్యింది.

నిన్న ఒక్కరోజే అనంతపురం 1, చిత్తూరు 16, తూర్పుగోదావరి 6, గుంటూరు 7, కడప 0, కృష్ణ 10, కర్నూలు 0, నెల్లూరు 3, ప్రకాశం 0, శ్రీకాకుళం 2, విశాఖపట్నం 7, విజయనగరం 0, పశ్చిమ గోదావరిలలో 8 కేసులు చొప్పున నమోదయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలో మారిన వాతావరణం.. 15 జిల్లాలకు హై అలర్ట్.. అక్కడ తుపాను గండం
అమరావతిని ఇంచు కూడా కదిలించలేవు జగన్ | CBN Massive Speech | Asianet Telugu