వందమందితో జంబో టీమ్... తెలుగు మహిళా రాష్ట్ర కమిటీని ప్రకటించిన అనిత

Arun Kumar P   | Asianet News
Published : Aug 13, 2021, 01:54 PM IST
వందమందితో జంబో టీమ్... తెలుగు మహిళా రాష్ట్ర కమిటీని ప్రకటించిన అనిత

సారాంశం

ఆంధ్ర ప్రదేశ్ లో టిడిపిని మరింత బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత కీలక నిర్ణయం తీసుకున్పారు.100మంది మహిళా నాయకులతో జంబో  తెలుగు మహిళా రాష్ట్ర కమిటీనీ ఏర్పాటుచేశారు. 

అమరావతి: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కమిటిని ప్రకటించారు  తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. సామాజిక కోణంలో ఆలోచించి అన్ని కులాలవారికి ప్రాధాన్యతనిస్తూ ఈ కమిటీ ఎంపిక జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన వంద మందితో ఒక టీం ఏర్పాటుచేశామని... బడుగు, బలహీన వర్గాలవారికి ప్రత్యేక స్థానం కల్పిస్తున్నామనడానికి ఉదాహరణే ఈ టీం ఎంపిక అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారికి 75 శాతం అవకాశమిచ్చి సముచిత స్థానం కల్పించామన్నారు. కేవలం 35 శాతం మాత్రమే ఓసీలకు స్థానం కల్పించామన్నారు.  

అమలాపురం ముమ్మడివరం రామలక్ష్మి, అనకాపల్లి నుంచి కె. రత్నకుమారి, రంపచోడవరం నుంచి గొర్ల సునీత, కాకినాడ నుంచి మాజీ ఎమ్మెల్సీ వివకుమారి, పత్తిపాడు నుంచి బి. గంగ, పాలకొల్లు నుంచి రోజారమణి, కావలి నుంచి గుంటుపల్లి శ్రీదేవి చౌదరి, రాజమండ్రి సిటీ నుంచి పార్వతి, టెక్కలి నుంచి విజయలక్ష్మి, భీమిలి నుంచి రమణమ్మ, బద్వేల్ నుంచి ఝాన్సీ యాదవ్, ఒంగోలు నుంచి ఆళ్ల రత్నమ్మ, గుంటూరు వెస్ట్ నుంచి పద్మావతి, విజయవాడ వెస్ట్ నుంచి ఆశా షేక్ లను ఉపాధ్యక్షులుగా ఎంపిక చేయడం జరిగిందన్నారు. 

అమలాపురం రాజోలు నుంచి భూదేవి మంగిన, అనంతపురం అర్బన్ నుంచి టి. స్వప్న, పాడేరు నుంచి విజయారాణి, రేపల్లె నుంచి జయప్రద, గన్నవరం నుంచి నాగకల్యాణి, మంగళగిరి నుంచి ఆకుల జయసత్య, తెనాలి నుంచి శ్రీదేవిలు సోషల్ మీడియా జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తారని అనిత వెల్లడించారు. 

చిలకలూరిపేట నుంచి షాహెద్ జైన్ సుల్తానా, సూళ్లురుపేట నుంచి ముప్పాల విజయరెడ్డిలు జనరల్ సెక్రటరిలుగా వ్యవహరిస్తారన్నారు. అధికార ప్రతినిధులుగా విశాఖపట్నం నార్త్ నుంచి ఈతలపట్ల సుజాత, పాతపట్నం నుంచి నల్లి సుజాత, కొత్తపేట నుంచి మమత, గోపాలపురం నుంచి బెయిలుముడి సుధారాణి, అనపర్తి నుంచి బీరా వీణమ్మ, పెనమలూరు నుంచి యార్లగడ్డ సుచిత్ర, నందిగామ నుంచి యార్లగడ్డ నూకమ్మ, గుంటూరు వెస్ట్ నుంచి విజయ, పరచూరు నుంచి సౌజన్య, మనికొండ నుంచి జాహ్నవి, తాటికొండ నుంచి శిరీష, దర్శి నుంచి మాలెపాటి వెంకట శోభారాణి, నగిరి నుంచి ఆర్. మీరా, కొడుమూరు నుంచి సీబీ లత, అనంతపురం అర్బన్ నుంచి స్వరూపలు వ్యవహరిస్తారని తెలిపారు.

read more   శ్రీవారి నగలు అమ్మేస్తారేమో.. మా వెంకన్నను వదిలేయండి: రఘురామ సంచలన వ్యాఖ్యలు

ఆర్గనైజర్ సెక్రటరి, సెక్రటరీలను కుడా ఎన్నుకోవడం జరిగిందన్నారు. పార్వతీపురం నుంచి శ్రీదేవి, పలాస నుంచి ఝాన్సీ, గజపతి నగరం నుంచి రమణమ్మ, భీమిలీ నుంచి లీలావతి, యలమంచలి నుంచి కడియం అనురాధ, పత్తిపాడు నుంచి శ్యామలాదేవి, భీమవరం నుంచి కనకదుర్గ, రాజమండ్రి సిటీ నుంచి నిర్మల, చింతలపుడి నుంచి సౌభాగ్యవతి, తెనాలి నుంచి సరళాదేవి, పెదకూరపాడు నుంచి వైకుంఠ రాణి, బాపట్ల నుంచి ఎం. విజాత, ఒంగోలు నుంచి నర్సమ్మ, కనిగిరి నుంచి దోసపాటి శివకుమారి కొండేపి నుంచి  రావిపాటి శీతమ్మ, నెల్లూరు సిటీ నుంచి నిర్మల, విజయవాడ ఈస్ట్ నుంచి చినతల్లి, మాదాల వెంకట రాజ్యలక్ష్మి వెస్ట్ నుంచి తుపాకుల రమణమ్మ, నంద్యాల నుంచి దూదేకుల ఝాన్సీ, ఆలూరు నుంచి సులక్షణా రెడ్డి, కల్యాణదుర్గం నుంచి బిక్కి రామలక్ష్మీ, కదిరి నుంచి బి. రమణ, ప్రొద్దుటూరు నుంచి డాక్టర్ మల్లెల లక్ష్మి, సర్వేపల్లి నుంచి భార్గవి, పీలేరు నుంచి సుభద్రమ్మ, చిత్తూరు నుంచి సీఎం విజయ, భీమిలి నుంచి లీలావతి, తిరుపతి నుంచి విజయలక్ష్మిలు ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఉంటారన్నారు. 

సెక్రటరీలుగా అరకు నుంచి పాయం దేవి, విజయనగరం నుంచి సూర్యకుమారి, తణుకు నుంచి రమణమ్మ, ఏలూరు నుంచి అచ్చుతా రాజేష్, విజయవాడ సెంటర్ నుంచి మద్దాల రుక్మిణి, పొన్నూరు నుంచి మాలినేని రుక్మిణి, మంగళగిరి నుంచి జానకీదేవి, తాడికొండ నుంచి రత్నకుమారి, ఆచంట నుంచి ఆదిలక్ష్మి, కనిగిరి నుంచి సుభాషిణి, వేముల నుంచి విజయనిర్మల, ఆళ్లగడ్డ నుంచి యాలాల నూర్జహాన్, ఆదోని నుంచి షాహిద్ బేగం, సింగనమలై నుంచి విశాలాక్షి, హిందూపురం నుంచి కె. పరిమళ, బనగానిపల్లె నుంచి ఫారూఖ్ బీ, సూళ్లూరుపేట నుంచి తుపాకుల కన్నమ్మ, రాజంపేట నుంచి ఓబినేని సుబ్బమ్మ, చంద్రగిరి నుంచి సింధూసుధ, చిత్తూరు నుంచి వైవి రాజేశ్వరి, హసీనాలు, గుంటూరు ఈస్ట్ నుంచి వాణి, తిరుపతి నుంచి కుమారి, గూడూరు నుంచి లీలావతి, ఆత్మకూరు నుంచి పి. శైలజారెడ్డి లు వ్యవహరిస్తారని తెలిపారు.

అనకాపల్లి సేనాపతి స్వరూప, అమలాపురం నుంచి సత్య పూర్ణిమ, విజయవాడ సెంట్రల్ నుంచి గాయత్రి, పాణ్యం నుంచి బత్తుల సుభద్రమ్మ, మదనపల్లె నుంచి తులసి వీరు ఐదుగురు మీడియా కో ఆర్డినేటర్ లుగా వ్యవహరిస్తారన్నారు. అదేవిధంగా సోషల్ మీడియా కో ఆర్డినేటర్స్ కింద విజయనగరం నుంచి శుషారాణి, ఈస్ట్ గోదావరి గన్నవరం నుంచి రాజేశ్వరి, సత్యవేడు నుంచి మౌనిక, పుట్టపర్తి నుంచి ఎం. షకీలా లను ఎంపిక చేసినట్లుగా వివరించారు. వీరందరూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, మహిళల రక్షణ కోసం పాటుపడాల్సిందిగా మహిళా అధ్యక్షురాలు అనిత పిలుపునిచ్చారు.

 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్