జగన్ ఆస్తుల కేసులో ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం నాడు కోర్టు విచారించింది. బెయిల్ రద్దుపై నిర్ణయాన్ని కోర్టుకే వదిలేసింది సీబీఐ. ఈ విషయమై కౌంటర్ కు సమయం కావాలని విజయసాయిరెడ్డి తరపు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.
అమరావతి: .జగన్ ఆస్తుల కేసులో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేసే విషయమై విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది సీబీఐ. ఈ మేరకు శుక్రవారం నాడు సీబీఐ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు.
నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు విజయసాయిరెడ్డి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయమై తమ అభిప్రాయాన్ని తెలపాలని సీబీఐని ఆదేశించింది కోర్టు. బెయిల్ రద్దుపై నిర్ణయాన్ని కోర్టుకే వదిలేసింది సీబీఐ. విచక్షణ మేరకు ఈ విషయమై నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరింది సీబీఐ. ఈ మేరకు మెమోను దాఖలు చేసింది.
ఈ విషయమై కౌంటర్ దాఖలు చేసేందుకు తనకు సమయం కావాలని విజయసాయిరెడ్డి న్యాయవాది కోర్టును కోరారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 16వతేదీకి వాయిదా వేసింది కోర్టు.ఈ నెల 16వ తేదీన కోర్టు ఏ రకమైన నిర్నయం తీసుకొంటుందోననే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.