ఏపీలో భయపెడుతున్న కరోనా: కొత్తగా 4,228 కేసులు.. చిత్తూరులో పరిస్ధితి ఆందోళనకరం

By Siva KodatiFirst Published Apr 13, 2021, 5:46 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసులను చూస్తే.. ఇక్కడ పరిస్ధితి అదుపు తప్పుతున్నట్లే కనిపిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్‌లతో ఏపీ పోటీ పడుతున్నట్లుగా పరిస్ధితి వుంది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కేసులను చూస్తే.. ఇక్కడ పరిస్ధితి అదుపు తప్పుతున్నట్లే కనిపిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్‌లతో ఏపీ పోటీ పడుతున్నట్లుగా పరిస్ధితి వుంది.

గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,228 మందికి పాజిటివ్‌గా తేలడం అధికార వర్గాలను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 9,32,892కి చేరింది.

నిన్న ఒక్కరోజే కోవిడ్ కారణంగా 10 మంది మరణించారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7,321కి చేరుకుంది. కోవిడ్ వల్ల చిత్తూరులో నలుగురు, నెల్లూరులో ఇద్దరు, గుంటూరు, కృష్ణ, కర్నూలు, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు.

గత 24 గంటల్లో 1,483 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 8,99,721కి చేరింది. నిన్న ఒక్కరోజే 35,582 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,54,98,728కి చేరుకున్నాయి.

గడిచిన 24 గంటల వ్యవధిలో అనంతపురం 128, చిత్తూరు 842, తూర్పుగోదావరి 538, గుంటూరు 622, కడప 334, కృష్ణ 261, కర్నూలు 88, నెల్లూరు 268, ప్రకాశం 284, శ్రీకాకుళం 271, విశాఖపట్నం 414, విజయనగరం 130, పశ్చిమ గోదావరిలలో 48 చొప్పున కేసులు నమోదయ్యాయి. 


 

: 13/04/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 9,29,997 పాజిటివ్ కేసు లకు గాను
*8,96,826 మంది డిశ్చార్జ్ కాగా
*7,321 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 25,850 pic.twitter.com/OIHS6Kvl2K

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!