కోవిడ్‌కి భయపడ్డారా.. ప్యాకేజ్ అందలేదా, క్వారంటైన్‌‌లోకి ఎందుకు: పవన్‌పై అంబటి సెటైర్లు

Siva Kodati |  
Published : Apr 13, 2021, 05:13 PM ISTUpdated : Apr 13, 2021, 05:14 PM IST
కోవిడ్‌కి భయపడ్డారా.. ప్యాకేజ్ అందలేదా, క్వారంటైన్‌‌లోకి ఎందుకు: పవన్‌పై అంబటి సెటైర్లు

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడులపై విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ ఓటమి ఖాయమైందని.. అందుకే రాళ్ల దాడి డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడులపై విరుచుకుపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ ఓటమి ఖాయమైందని.. అందుకే రాళ్ల దాడి డ్రామా ఆడుతున్నారని ఆరోపించారు.

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ క్వారంటైన్‌కు వెళ్లింది భయపడా? డబ్బు అందకా? అని అంబటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీకి 30శాతం లోపే ఓట్లు వస్తాయని జోస్యం చెప్పారు.

జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడి స్థాయి నుంచి టీడీపీ అధ్యక్షుడి స్థాయికి పడిపోయారని అంబటి ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుని ఆయన మాట్లాడాలని హితవు పలికారు.

Also Read:రాళ్లు విసిరిన వారిని చూశారా?: బాబు భద్రతా సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు

ప్రైవేట్‌ పోర్టులో షేర్లను అదానీ గ్రూప్‌ కొంటే వైసీపీకి సంబంధమేంటని అంబటి ప్రశ్నించారు. ప్రధాని మోడీని సీఎం జగన్‌ పలుమార్లు కలిసినా కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు నెరవేర్చలేదని రాంబాబు ఆరోపించారు.   

సోమవారం నాడు తిరుపతి రైల్వేస్టేషన్ నుండి కృష్ణాపురం వరకు బాబు రోడ్ షో నిర్వహించారు.  ఇక్కడే సభలో ప్రసంగిస్తున్న సమయంలో రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచార వాహనం వద్దే రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు.ఆ తర్వాత ఆయన పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. 

మంగళవారం నాడు ఉదయం తిరుపతి వెస్ట్ పోలీసులు చంద్రబాబునాయుడు వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ప్రశ్నించారు.  రాళ్లు వేసినవారిని చూశారా?, రాళ్లు ఏ వైపు నుండి వచ్చాయనే విషయమై ప్రశ్నించారు. రాళ్లు వేసినవారిని గుర్తు పడతారా అని బాబు సెక్యూరిటీని ప్రశ్నించారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు