ఏపీలో అదుపులోకి కరోనా : కొత్తగా 4,147 మందికి పాజిటివ్.. ఆ మూడు జిల్లాల్లో నమోదుకానీ మరణాలు

Siva Kodati |  
Published : Jun 26, 2021, 05:56 PM IST
ఏపీలో అదుపులోకి కరోనా : కొత్తగా 4,147 మందికి పాజిటివ్.. ఆ మూడు జిల్లాల్లో నమోదుకానీ మరణాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 4,147 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,72,727 చేరుకుంది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా పడిపోయాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 4,147 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,72,727 చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 38 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 12,566కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి అనంతపురం 2, తూర్పుగోదావరి 5, చిత్తూరు 7, గుంటూరు 7, కృష్ణ 5, విశాఖపట్నం 2, విజయనగరం 1, శ్రీకాకుళం 4, పశ్చిమ గోదావరి 3, కడపలో ఇద్దరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 5,773 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 18,14,035కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 96,121 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,16,37,606కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 46,126 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 180, చిత్తూరు 569, తూర్పుగోదావరి 838, గుంటూరు 321, కడప 226, కృష్ణ 310, కర్నూలు 160, నెల్లూరు 196, ప్రకాశం 289, శ్రీకాకుళం 128, విశాఖపట్నం 229, విజయనగరం 130, పశ్చిమ గోదావరిలలో 571 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.
 

PREV
click me!

Recommended Stories

Baba Ramdev baba Incredible Yoga: రామ్ దేవ్ బాబా ఆసనాలకి సీఎం చంద్రబాబు షాక్ | Asianet News Telugu
Ramdev baba vs Nara Lokesh: రామ్ దేవ్ బాబాతో లోకేష్ పోటీ చివరికి ఏమైందో చూడండి | Asianet News Telugu