ఒకరి నుంచి ముగ్గురికి కరోనా: ఒక్కొక్కరిగా కుటుంబంలోని నలుగురిని బలి తీసుకున్న మహమ్మారి

By Siva KodatiFirst Published Aug 15, 2020, 4:34 PM IST
Highlights

కరోనా వైరస్ ప్రజల జీవితాల్లో అంతులేని విషాదాన్ని మిగులుస్తోంది. తాజాగా ఈ మహమ్మారి కారణంగా కర్నూలు జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు

కరోనా వైరస్ ప్రజల జీవితాల్లో అంతులేని విషాదాన్ని మిగులుస్తోంది. తాజాగా ఈ మహమ్మారి కారణంగా కర్నూలు జిల్లాలో ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.

రుద్రవరం మండలం నర్సాపురం గ్రామానికి చెందిన రాచంరెడ్డి రామిరెడ్డి సోదరి దస్తగిరమ్మ (70) కొన్ని రోజుల క్రితం కరోనా బారినపడింది. ఆ తర్వాత కొన్నిరోజులకే ఆమె కుమారుడు నాగార్జున రెడ్డికి కూడా పాజిటివ్‌గా తేలింది.

Also Read:అందని వైద్యం.. కన్న తల్లి కళ్ల ముందే ప్రాణాలు విడిచిన కొడుకు..

దీంతో వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే వారి ఆరోగ్యం విషమించడంతో ఈ నెల 8న నాగార్జున రెడ్డి, ఈ నెల 11న దస్తగిరమ్మ మరణించారు. ఈ విషాదం నుంచి కోలుకోకముందే దస్తగిరమ్మ అన్న రాచంరెడ్డి రామిరెడ్డి, ఆయన కుమారుడు రామ్మోహన్ రెడ్డి సైతం కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు రోజుల వ్యవధిలో మరణించడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. కాగా శుక్రవారం ఒక్క రోజే ఏపీలో 8,943 మందికి కరోనా సోకింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,73,085కి చేరిన సంగతి తెలిసిందే. 

click me!