టీ.కాంగ్రెస్ లో చేరికల పంచాయతీ.. పీసీసీ సమావేశానికి నలుగురు అగ్రనేతల డుమ్మా , ఠాగూర్ సీరియస్

Siva Kodati |  
Published : Jul 09, 2022, 02:10 PM ISTUpdated : Jul 09, 2022, 02:13 PM IST
టీ.కాంగ్రెస్ లో చేరికల పంచాయతీ.. పీసీసీ సమావేశానికి నలుగురు అగ్రనేతల డుమ్మా , ఠాగూర్ సీరియస్

సారాంశం

ఎన్నికలకు ముందు చేరికలతో టీ కాంగ్రెస్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది. కానీ మరోవైపు నియోజకవర్గాల్లో నేతలు మాత్రం దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరిపై పోరాడామో వారితో కలిసి పనిచేయడం తమ వల్ల కాదని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వివాదాలను పరిష్కరించేందుకు అధిష్టానం రంగంలోకి దిగింది. 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్యం ఠాగూర్ అధ్యక్షతన గాంధీ భవన్ లో పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. అయితే దీనికి సీనియర్ నేతలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీ గౌడ్ గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. ప్రధానంగా ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి చర్చికలపై చర్చ జరిగింది. టీ. కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలపై హైకమాండ్ ఫోకస్ పెట్టింది. పార్టీలో చేరికలపై ఇటీవలి కాలంలో నేతల మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. గీత దాటిన నేతలను లైన్‌లో పెట్టేందుకు అధిష్టానం సిద్ధమైంది. దీనిలో భాగంగా ముఖ్య నేతలతో ఠాగూర్ సమావేశమయ్యారు. 

కాగా.. తెలంగాణ కాంగ్రెస్‌లో (telangana congress) జోష్ కనిపిస్తోంది. చేరికలు కొనసాగుతూ వుండటంతో హస్తం పార్టీ (congress) కొత్త ఉత్సాహంతో వుంది. అయితే చేరికలపై కొందరు నాయకులు అసంతృప్తిగా వుండటంతో కొత్త పంచాయతీలు తెరపైకి వస్తున్నాయి. అధికార టీఆర్ఎస్ (trs) నుంచి వచ్చే నేతలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చేందుకు హస్తం పార్టీ సముఖత వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే ఓదేలు ఆయన సతీమణితో పాటు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఇటీవలే పీజీఆర్ కుమార్తె విజయారెడ్డి (vijaya reddy), అశ్వారావు పేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూడా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. 

ALso Read:చేరికలతో టీ.కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పులు.. అధిష్టానానికి నేతల ఫిర్యాదులు, రేవంత్ వద్దకు పంచాయతీ

ఇదిలావుంటే ఖమ్మం జిల్లా నేతలు కాంగ్రెస్‌లో చేరడం ఆ పార్టీ శ్రేణుల్లో కొంత అసంతృప్తికి కారణమైంది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఎలాంటి సమాచారం లేకపోవడం చర్చనీయాంశమైంది. దీనిపై అశ్వారావుపేట కాంగ్రెస్ నేతలు భట్టికి ఫిర్యాదు చేశారు. ఇక తుంగతుర్తి నియోజకవర్గం నుంచి డాక్టర్ రవి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై తుంగతుర్తి ఇన్‌ఛార్జి అద్దంకి దయాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (komatireddy venkatreddy) సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన డాక్టర్ రవి.. పీసీసీ చీఫ్ రేవంత్‌ను (revanth reddy) కలిసేందుకు వెళ్లగా ఆయన భేటీకి నిరాకరించారు. 

ఇకపోతే.. మొన్న కాంగ్రెస్ లోకి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ (erra sekhar) వచ్చారు. రేవంత్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఎర్ర శేఖర్ చేరికను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నేర చరిత్ర కలిగిన ఎర్ర శేఖర్ ను పార్టీలోకి ఎలా చేర్చుకుంటారని ఆయన ప్రశ్నిస్తున్నారు. గాంధీ సిద్ధాంతాలను నమ్మే కాంగ్రెస్ లోకి నేరగాళ్లు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్ర శేఖర్ చేరికపై అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో వున్నారు కోమటిరెడ్డి. మరోవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి గీతా రెడ్డి కూడా చేరికను సమర్ధించారు. 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్