బాబు ఎఫెక్ట్: 30 మంది డిఎస్పీలకు నో పోస్టింగ్

By narsimha lodeFirst Published Jun 28, 2019, 2:27 PM IST
Highlights

 రాష్ట్రంలో  37 మంది డిఎస్పీలను బదిలీ చేసింది ప్రభుత్వం. 30 మంది డిఎస్పీలకు పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఏడుగురు డిఎస్పీలకు ఇంటలిజెన్స్‌లో పోస్టింగులిచ్చారు. 

అమరావతి:  రాష్ట్రంలో  37 మంది డిఎస్పీలను బదిలీ చేసింది ప్రభుత్వం. 30 మంది డిఎస్పీలకు పోస్టింగ్‌లు ఇవ్వలేదు. ఏడుగురు డిఎస్పీలకు ఇంటలిజెన్స్‌లో పోస్టింగులిచ్చారు. చంద్రబాబునాయుడు సర్కార్‌ హాయంలో ఈ డిఎస్పీలంతా టీడీపికి అనుకూలంగా పనిచేశారని సర్కార్  ఈ నిర్ణయం తీసుకొందని చెబుతున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో  జరిగిన ఎన్నికల సమయంలో  వివిద హోదాల్లో డిఎస్పీలను నియమించారు. 37 మంది డిఎస్పీలను శుక్రవారం నాడు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

30 మంది డిఎస్పీలను పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్ చేశారు. హెడ్ క్వార్టర్స్‌కు అటాచ్‌ చేసిన 30 మంది డిఎస్పీలపై ఆరోపణలు ఉన్నాయి. తీవ్రమైన ఆరోపణలు ఉన్న  డిఎస్పీలను ఏపీ సర్కార్  బదిలీ చేసింది. 

ఎన్నికల సమయంలో  ఆనాడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి అనుకూలంగా  పనిచేశారనే ఆరోపణలు ఉన్నందునే  ఈ బదిలీ చేశారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ డిఎస్పీలకు పోస్టింగ్‌లు ఎప్పుడు ఇస్తారోననే చర్చ కూడ సాగుతోంది. రెండు రోజుల్లో మరి కొంతమంది డిఎస్పీలపై కూడ బదిలీ వేటు పడే అవకాశం ఉంది.


 

click me!