ఆంధ్రాకు అలర్ట్: ఒకే రోజు 300 మందికి పాజిటివ్.. హాట్ స్పాట్‌గా చిత్తూరు

Siva Kodati |  
Published : Mar 14, 2021, 06:58 PM ISTUpdated : Mar 14, 2021, 06:59 PM IST
ఆంధ్రాకు అలర్ట్: ఒకే రోజు 300 మందికి పాజిటివ్.. హాట్ స్పాట్‌గా చిత్తూరు

సారాంశం

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇవాల కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇవాల కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది.

గడిచిన కొన్ని రోజులుగా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 298 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,91,861కి చేరింది.

నిన్న కోవిడ్ వల్ల నెల్లూరు, విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు వైరస్ బారినపడి మరణించిన వారి సంఖ్య 7,184కి చేరుకుంది.

ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 1,400 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 164 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 8,83,277కి చేరింది. నిన్న 45,664 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా.. ఇప్పటి వరకు మొత్తం నిర్థారణా పరీక్షల సంఖ్య 1,45,34,762కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 9, చిత్తూరు 90, తూర్పుగోదావరి 32, గుంటూరు 48, కడప 12, కృష్ణా 32, కర్నూలు 14, నెల్లూరు 3, ప్రకాశం 11, శ్రీకాకుళం 7, విశాఖపట్నం 32, విజయనగరం 3, పశ్చిమ గోదావరిలలో 5 చొప్పున కేసులు నమోదయ్యాయి. 

 

PREV
click me!

Recommended Stories

ఒక్కక్క అధికారికి చెమటలు పట్టించాడు | Pawan Kalyan Rajamandry Tour | Asianet News Telugu
ఒక్కసారిగా ఏం జరిగిందో చూడండి | Dy CM Pawan Kalyan Rajamandry Tour | Asianet News Telugu