విశాఖ స్టీల్ ప్లాంట్‌‌ను తీసుకోవడానికి రాష్ట్రం ముందుకొస్తే ఆలోచిస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

By narsimha lodeFirst Published Mar 14, 2021, 6:01 PM IST
Highlights

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకొంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
 

హైదరాబాద్: విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకొంటుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

ఆదివారం నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.నష్టాల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ను నడపడం భారమన్నారు. స్టీల్ ప్లాంట్ ను తీసుకోవడానికి రాష్ట్రం ముందుకొస్తే కేంద్రం ఆలోచిస్తోందని ఆయన చెప్పారు.

ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందన్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తామని ఇటీవల కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. ఈ ప్రకటనతో విశాఖలో కార్మిక సంఘాలు, రాజకీయపార్టీలు ఆందోళనలు సాగిస్తున్నాయి.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించవద్దని సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు. ప్రత్యామ్నాయాలను కూడ సూచించారు. మరో వైపు అఖిలపక్షనేతలు, కార్మిక సంఘాలతో కలిసి వస్తానని అపాయింట్ మెంట్ ఇవ్వాలని సీఎం జగన్ మరోసారి పీఎంకు లేఖ రాశారు.కేంద్రం మాత్రం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అనుకూలంగా ఉన్నట్టుగా స్పష్టం చేసింది. 
 

click me!