పెన్షన్ కట్ చేస్తామంటే జనం భయపడరా: మున్సిపల్ ఫలితాలపై వర్ల రామయ్య స్పందన

Siva Kodati |  
Published : Mar 14, 2021, 06:10 PM IST
పెన్షన్ కట్ చేస్తామంటే జనం భయపడరా: మున్సిపల్ ఫలితాలపై వర్ల రామయ్య స్పందన

సారాంశం

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. ప్రలోభాలకు, బెదిరింపులకు పాల్పడి వైసీపీ ఎన్నికల్లో గెలిచిందని ఆయన ఆరోపించారు. వాలంటీర్లు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు రావని బెదిరించారని... ఎన్నికల కమీషన్ కట్టుదిట్టంగా వ్యవహరించకపోతే వాలంటీర్లే వెళ్లే ఓట్లు వేయించేవారని రామయ్య ఎద్దేవా చేశారు

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై స్పందించారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. ప్రలోభాలకు, బెదిరింపులకు పాల్పడి వైసీపీ ఎన్నికల్లో గెలిచిందని ఆయన ఆరోపించారు.

వాలంటీర్లు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు రావని బెదిరించారని... ఎన్నికల కమీషన్ కట్టుదిట్టంగా వ్యవహరించకపోతే వాలంటీర్లే వెళ్లే ఓట్లు వేయించేవారని రామయ్య ఎద్దేవా చేశారు.

వాలంటీర్ వ్యవస్థను దుర్వినియోగం చేసి.. పార్టీ కార్యకర్తల్లా ఉపయోగించుకున్నారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 లక్షల మంది కార్యకర్తల బలం వున్న తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో ఓడిపోవడంపై ఆలోచించాల్సిన అవసరముందన్నారు.

వైసీపీకి ముందుంది మొసళ్ల పండుగ అంటూ ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఓటమి ద్వారా క్యాడర్‌లో పౌరుషం, రోషం వచ్చాయని వర్ల రామయ్య స్పష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!