విజయనగరంలో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం: పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు

By narsimha lode  |  First Published Oct 24, 2022, 5:36 PM IST

ఉమ్మడి విజయనగరం జిల్లా  కురుపానికి సమీపంలో  ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రమాదవశాత్తు  బస్సు  పొలాల్లోకి  వెళ్లింది. ఈ  ప్రమాదం  జరిగిన  సమయంలో  బస్సులోమ 30  మంది  ప్రయాణీకులున్నారు.


విజయనగరం: ఉమ్మడి విజయనగరం  జిల్లా కురుపానికి సమీపంలో తుమ్మికమాన్ గూడ  వద్ద  ఆర్టీసీ బస్సు కు  ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు పొలాల్లోకి  దూసుకెళ్లింది. బస్సులో  ప్రయాణీకులకు  ఎలాంటి   ప్రమాదం  జరగలేదు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో  బస్సులో  30 మంది ప్రయాణీకులున్నారు.ఆర్టీసీ బస్సు  నీలకంఠాపురం నుండి విశాఖకు  వెళ్తున్న సమయంలో ఈ ఘటన  చోటు  చేసుకుంది.

గతంలో కూడ  రెండు తెలుగు రాష్ట్రాల్లో  ఆర్టీసీ బస్సులకు ప్రమాదాలు జరిగాయి.ఉమ్మడి కృష్ణా  జిల్లాలో మూడు రోజుల  క్రితం ఆర్టీసీ బస్సులో  మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో బస్సులో 40 మంది  ప్రయాణీకులున్నారు. విజయవాడ  నుండి బస్సు గుడివాడ  వెళ్తున్న సమయంలో  ఈ  ప్రమాదం  చోటు  చేసుకుంది. సాంకేతిక లోపంతోనే బస్సులో  మంటలు వ్యాపించినట్టుగా ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. బస్సులోని ప్రయాణీకులకు  ఎలాంటి  ప్రమాదం  జరగకపోవడంతో  అంతా ఊపిరి  పీల్చుకున్నారు.

Latest Videos

undefined

ఈ  నెల 11న పశ్చిమ గోదావరి జిల్లాలో రన్నింగ్ లో ఉన్న ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడిపోయాయి.అయితే   బస్సులోని ప్రయాణీకులకు ఎలాంటి ప్రమాదం  చోటు  చేసుకోలేదు.  బస్సు తక్కువ  స్పీడ్  లో వెళ్తున్నందున ప్రమాదం తప్పిందని  ఆర్టీసీ అధికారులు తెలిపారు. నరసాపురం డిపోకు చెందిన బస్సు ఏలూరు వెళ్తున్న సమయంలో అడ్డమూరు వద్ద  ఈ ప్రమాదం  జరిగింది.

ఇదే తరహా  ఘటన తెలంగాణ జిల్లాలో కూడ జరిగింది. గత ఏడాది  జూలై మాసంలో  మోత్కూరు వద్ద రన్నింగ్ బస్సుకు చక్రాలు ఊడిపోయాయి. అయితే బస్సులోని ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.హైద్రాబాద్  నుండి బస్సు  తొర్రూర్ కు వెళ్తున్న సమయంలో  ఈ ప్రమాదం  జరిగింది.

ఈ ఏడాది సెప్టెంబర్ 10న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని  మానకొండూర్ మండలం వెగురుపల్లిలో ఓ ఆర్టీసీ బస్సు కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. వేగురుపల్లి నుండి కరీంనగర్ వెలుతుండగా బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి. ఈ సమయంలో బస్సులో  60  మంది  ప్రయాణీకులున్నారు.

 

click me!